![gun fire recorded at Minneapolis last night](https://manalokam.com/wp-content/uploads/2020/06/Minneapolis11.jpg)
అమెరికాలో ఘర్షణల సెగలు ఇంకా చల్లారడం లేదు.. గత నెల రోజులుగా అమెరికా లో ఎన్నడూ లేని స్థాయిలో అల్లర్లు జరుగుతున్నాయి. వారి దేశాన్ని ఓ పక్క కరోనా పీల్చి పిప్పి చేస్తుంటే మరోపక్క తమకు తామే క్రైమ్ రేట్ ను పెంచుకుంటున్నారు. అమెరికాలోని మెన్నేయపొలీస్ నగరంలో జార్జ్ ఫ్లయిడ్ హత్యతో మొదలైన అల్లర్లు ఇప్పటికీ కూడా సద్దుమనగడం లేదు. అక్కడి ప్రజలు పోలీసులకే చుక్కలు చూపుతున్నారు..! తాజాగా నిన్న రాత్రి 12.30 ప్రాంతంలో అక్కడ విషాద ఛాయలు అలమటించాయి.. కాల్పుల కలకలం రక్తపు మరకలు ఫేస్ బుక్ లైవ్ లో రికార్డ్ అయ్యాయి. కొందరు గుర్తుతెలియని దుండగులు అక్కాడికి చేరుకొని అక్కడ ఉన్న పౌరులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి బాధితులను ఆసుపత్రికి తరలించారు. కాగా పోలీసులు వచ్చే లోపే దుండగులు అక్కడనుండి పరారయ్యారు.