మోడీకి షాక్.. మన్‌కీ బాత్ కి డిస్ లైక్ ల వెల్లువ..

-

ప్రధాన మంత్రి మోడీకి నెటిజన్లు షాకిచ్చారు. అదెలా అంటే తమ డిస్ లైక్స్ ద్వారా. ప్రధాని మోడీ ప్రతినెల నాలుగవ ఆదివారం మన్‌కీ బాత్ అంటూ ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. తన మనసులో మాటని ప్రజలకి తెలియచెప్పే ఈ కార్యక్రమాన్ని రేడియో కోసం రూపొందించారు. అయితే దానిని కాస్త మార్చి ఆయన మాట్లాడుతున్న దానిని, బీజేపీ యూట్యూబ్ ఛానెల్ సహా కొన్ని అధికారిక ఛానెల్స్ టెలీకాస్ట్ చేస్తున్నాయి. కానీ నిన్న నిర్వహించిన కార్యక్రమానికి డిస్ లైక్ లు వెల్లువలా వచ్చి పడ్డాయి.

ఇప్పటికే కరోనాతో జనాలు అందరూ అతలాకుతలం అయిపోతుంటే ఈయన వచ్చి ఇండియన్ కుక్కల గురించి. ఏటికొప్పాక లక్క బొమ్మల గురించి చెబితే ఎలా అంటూ కొందరు కామెంట్స్ కూడా చేశారు. ఏదయినా జనానికి ఉపయోగ పడే విషయాలు చెబుతారు అనుకుంటే ఇలా ఆఫ్ ది టాపిక్ మాట్లాడినందుకే ఇలా నెటిజన్లు షాకిచ్చారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక గత కొద్ది రోజులుగా అయన విడుదల చేస్తున్న ఫోటో షూట్స్ విషయంలో కూడా నెటిజన్ల ట్రోలింగ్ ఎక్కువ అయిపోతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version