దేశ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో టెస్ట్ కిట్స్ కి డిమాండ్ ఎక్కువగా పెరుగుతుంది. కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో ఇప్పుడు కరోనా కిట్స్ అవసరం అనేది చాలా ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. దీనితో టెస్ట్ కిట్స్ ని ఇతర దేశాల నుంచి కూడా కొనుగోలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు హెచ్‌యుఎల్ కరోనా టెస్ట్ ల కోసం దాదాపు 13 కోట్ల రూపాయల విలువైన కిట్స్ ని అందించింది.
74,328 ఆర్‌టీ-పీసీఆర్ కోవిడ్-19 టెస్టింగ్ కిట్లను హిందుస్తాన్ యూనిలివర్ అందించింది. మహారాష్ట్ర ప్రభుత్వానికి 28,880 ఆర్‌టీ-పీసీఆర్ కిట్లను, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ 20,160 కిట్లు, మెట్రోపాలిస్ ల్యాబ్స్ (8,088 కిట్లు), అపోలో హాస్పిటల్స్(17,280 కిట్లు ) ఇచ్చింది. ఈ ఆర్‌టీ-పీసీఆర్ టెస్టింగ్ కిట్లలో న్యూక్లియక్ యాసిడ్ డయాగ్నోస్టిక్ కిట్, శాంపిల్ రిలీజ్ రీఏజెంట్, థ్రోట్ స్వాబ్, పీసీఆర్ ట్యూబ్, శాంపిల్ స్టోరేజీ రీఏజెంట్ ఉన్నాయని పేర్కొంది.
అంతర్జాతీయ సర్టిఫికేషన్ సంస్థలైన సీఈ ఐవీడీ, యుఎస్-ఎఫ్‌డీఏ, ఈయు సీఈ అనుమతులు ఇచ్చాయి. అదే విధంగా ప్రపంచ ఆరోగ్య సంస్ధ భాగస్వామ్యం కలిగిన ఫైండ్ జాబితాలో కు చోట సంపాదించాయి. హిందుస్తాన్ యూనిలివర్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ ఎండీ, సంజీవ్ మెహతా మీడియాతో మాట్లాడారు. తగినంతగా టెస్టింగ్ కిట్లు, ఇతర వైద్య సామాగ్రి సరఫరా చేయడం ద్వారా ఫ్రంట్‌లైన్ వారియర్స్ సమర్థవంతంగా కొవిడ్-19 వైరస్‌ను ఎదుర్కోగలరన్నారు.