బీటౌన్‌ బ్యూటీ హ్యుమా ఖురేషికి చేదు అనుభవం

-

ఎలాంటి సినిమా చేసినా కూడా హ్యుమా ఖురేషి తన పాత్ర మాత్రం చాలా విబిన్నంగా ఉండేలా చూసుకుంటుంది. హాట్ బ్యూటీలు ఎంత మంది ఉన్నా కూడా వారిలో టాలెంటెడ్ నటీమణులు కొందరే ఉంటారు. అలాంటి వారిలో హ్యుమా ఖురేషి ఒకరు. అయితే.. హ్యుమా ఎప్పుడూ సినిమాలతో పాటు కిల్లింగ్ లుక్స్‌తో వార్తల్లో నిలుస్తుంటుంది. ఈ బ్యూటీ మరోసారి లైమ్‌లైట్‌లోకి వచ్చింది. హ్యుమా ఖురేషి ఏదోపని నిమిత్తం అమెరికా న్యూజెర్సీలోని నెవార్క్‌కి వెళ్లింది. అక్కడ ఎయిర్‌లైన్స్‌ కస్టమర్ సర్వీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తన బ్యాగులు అందలేదని ట్విట్టర్ వేదికగా తెలిపింది. అంతటితో ఆగకుండా.. యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌ను ట్యాగ్ చేస్తూ సర్వీసులపై మండిపడింది. ‘నేను నెవార్క్‌కి ఇప్పుడే వచ్చాను.

కానీ, నా రెండు బ్యాగులు ఇంకా రాలేదు. సహాయం చేసేందుకు ఇక్కడ ఎవరూ లేరు. మీ ఆన్‌లైన్‌ నంబర్, వెబ్‌సైట్స్‌ పనికిరానివి. ఇక్కడ కస్టమర్ సర్వీస్ భయకరంగా ఉన్నాయి. నా వస్తువులు నాకు ఎప్పుడూ అందుతాయో తెలియదు’ అంటూ ట్వీట్ చేసింది. హ్యుమా ట్వీట్‌పై యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌ స్పందించింది. నటికి కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. బ్యాగులు అందడంలో ఆలస్యానికి చింతిస్తున్నామని, ఐడబ్ల్యూలోని బ్యాగేజ్ సర్వీస్ కార్యాలయంలో కంప్లైంట్ చేయాలని కోరింది. ఇదిలా ఉండగా.. హ్యుమా చివరిగా ‘మోనికా ఓ మై డార్లింగ్’ చిత్రంలో కనిపించింది. ఓటీటీలో విడుదలవగా.. హ్యుమా నటనతో ప్రశంసలు అందుకున్నది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version