దేశంలో రోజురోజుకీ కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలందరిలో ప్రాణభయం పాతుకుపోయింది. ఇప్పటికీ కూడా వైరస్ కు వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో అందుబాటులో లేదు. అయితే వైరస్ వ్యాప్తి తో తీవ్రంగా భయాందోళనకు గురవుతున్న ప్రజానీకానికి… క్రమక్రమంగా వందేళ్లు దాటినా వృద్ధులు సైతం కరోనా వైరస్ ను జయించి ఆరోగ్య వంతులు అవుతుండడంతో సరికొత్త ధైర్యాన్ని పోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు రాష్ట్రాలలో వృద్ధులు కరోనా ను జయించి ప్రజల్లో కొత్త ఊపిరి నింపారు.
ఇక ఇటీవలే మహారాష్ట్రలోని థానే కు చెందిన 102 ఏళ్ల ఆనందీబాయి పాటిల్ కరోనా వైరస్ బారిన పడింది. ఈ క్రమంలోనే స్థానికంగా ఉన్న కరోనా కేర్ సెంటర్ లో చికిత్స తీసుకుంది సదరు వృద్ధురాలు. అయితే కేవలం 14 రోజుల వ్యవధిలోనే సదరు వందేళ్లకు పైబడిన వృద్ధురాలు కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయింది. ఇక ప్రస్తుతం ఆ బామ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తాను కరోనా వైరస్ నుంచికోలుకుని డిశ్చార్జ్ అయిన కార్డు చూపుతూ ఆనందం వ్యక్తం చేసింది వృద్ధురాలు.