గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హయత్ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. గంటల వ్యవధిలో భార్యాభర్తలు ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. హయత్‌నగర్ ముదిరాజ్ కాలనీలో దంపతులు నగేష్, శిరీష ఉండేవారు.అనుకోకుండా నిన్న ఉదయం భార్య ఆత్మహత్యకు పాల్పడింది.
దీంతో భర్త నగేష్‌పై అనుమానంతో పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. అయితే, రాత్రి జామీను మీద నగేష్‌ను బంధువులు బయటకు తీసుకువచ్చారు.ఈ క్రమంలోనే హయత్‌నగర్ రిలయన్స్ డిజిటల్ షోరూమ్ పైనుండి దూకి నగేష్ సైతం ఆత్మహత్య చేసుకున్నాడు. గంటల వ్యవధిలో ఇద్దరూ మరణించడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా, వీరి మరణాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
https://twitter.com/TeluguScribe/status/1909862223587008591