భార్య చాప‌ల కూర వండ‌లేద‌ని.. అలిగి ఆ భ‌ర్త ఏం చేశాడంటే…

-

పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అన్నారు పెద్దలు. ఈ క్రమంలోనే మనకు ఆనందం వచ్చినా.. విచారం కలిగినా.. దుంఖం వ‌చ్చినా ఆ టైంలో ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. ఆనందం, సంతోషం, దుంఖం వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్ర‌వ‌ర్తిస్తూ ఉంటారు.. ఒక్కోలా నిర్ణ‌యాలు తీసుకొని ఉంటారు. ఈ క్రమంలోనే మద్యం మత్తులో ఉన్న ఓ భర్త తన భార్య చేప‌ల కూర వండ‌లేద‌ని అలిగి ఏం ? చేశాడో చూద్దాం.

భార్య చాపలకూర వండలేదని మద్యం మత్తులో ఓ భర్త టవర్ ఎక్కాడు. నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట నియోజకవర్గం పరిధిలో గల లింగాల మండలం కోమటికుంట గ్రామానికి చెందిన నరేష్ అనే యువకుడికి బ‌ల్మూర్‌కు చెందిన మ‌హిళ‌తో పెళ్ల‌య్యింది. అత‌డు ప‌ది రోజుల క్రింద‌ట అత్త‌గారి ఊరు అయిన బ‌ల్మూర్‌కు వ‌చ్చాడు. అక్క‌డ త‌న భార్య‌ను చాప‌ల కూర వండ‌మ‌ని అడిగాడు.

సోమవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన న‌రేష్ చాప‌ల కూర వండ‌మ‌న్నా ఎందుకు వండ‌లేదంటూ భార్య‌తో గొడ‌వ ప‌డ్డాడు. భార్య చేప‌ల కూర వండేందుకు నిరాక‌రించ‌డంతో అత‌డు అలిగి బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు. అక్క‌డ నుంచి మ‌ద్యం మ‌త్తులో సెల్ టవర్ ఎక్కాడు.. విషయం తెలుసుకున్న ఎస్ఐ వీరబాబు అక్కడికి వెళ్లి కోమటికుంట సర్పంచ్ బచ్చన్నను కూడా అక్క‌డ‌కు పిలిపించాడు.

స‌ర్పంచ్‌తో పాటు అక్క‌డున్న గ్రామపెద్ద‌లు అత‌డికి న‌చ్చ చెప్ప‌డంతో గంట‌న్న‌ర త‌ర్వాత అత‌డు ట‌వ‌ర్ దిగి రావ‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. అక్క‌డ గంట‌న్నర పాటు మ‌ద్యం మ‌త్తులో అత‌డు ఏం చేస్తాడా ? అని ఒక్క‌టే టెన్ష‌న్ నెల‌కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version