అన్నంలో వెంట్రుక వచ్చిందని భార్యకు గుండు గీయించిన భర్త.. 

-

ఈమధ్య భర్తలు సైకోయిజం పీక్స్‌కు వెళ్తుంది. చిన్న చిన్న విషయాలకే సైకోల్లా బిహేవ్‌ చేస్తున్నారు. కొన్నిసార్లు అయితే చిన్నచిన్న గొడవలే చిలికి చిలికి గాలివాన అయిపోతుంది. అన్నంలో వెంట్రుకలు వచ్చాయని భార్యకు గుండు గీయించాడు ఓ భర్త.. విషయం తెలిసి రంగంలోకి దిగిన పోలీసులకు షాకింగ్‌ నిజం తెలిసింది. ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్‌లోని ఫిలీబిత్ జిల్లా మిలాక్ గ్రామానికి చెందిన జహీరుద్దీన్ అనే యువకుడికి సీమాదేవితో ఏడేళ్ల క్రితమే పెళ్లి అయింది. శుక్రవారం సీమాదేవి జహీరుద్దీన్‌కి పెట్టిన భోజనంలో వెంట్రుక రావడంతో అతను తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. పొరపాటుగా జరిగిన తప్పును మందలించి సర్దుకుపోకుండా.. ఆమెపై తన అక్కసు, పగ తీర్చుకున్నాడు. సీమాదేవికి గుండు చేయించాడు. విషయం ఇరుగు పొరుగు వాళ్లకు తెలియడంతో బాధితురాలు సీమాదేవి పోలీసులను ఆశ్రయించింది.
అయితే జహీరుద్దీన్‌ భార్యకు గుండు చేయించింది అన్నంలో వెంట్రుక వచ్చినందుకు కాదనే విషయాన్ని పోలీసుల విచారణలో తేలింది. పెళ్లైన తర్వాత నుంచి జహీరుద్దీన్ 15లక్షల రూపాయలు అదనపు కట్నం తీసుకురావాలని భార్యను చిత్రహింసలకు గురి చేస్తున్నాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది.
బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో వరకట్న వేధింపుల కేసును నమోదు చేసి.. జహీరుద్దీన్‌ని జైలుకు పంపారు. మహిళల్ని చిన్న చిన్న విషయాలకు వేధించే వాళ్లను విడిచిపెట్టమని పోలీసులు హెచ్చరించారు. జహీరుద్దీన్‌ చేసిన పనికి స్థానికులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మనదేశంలో గృహహింసల కేసులు తారా స్థాయికి చేరాయి.. చిన్న చిన్న కారణాలకే భార్యలను కీలుబొమ్మాల్లా చేసి వాళ్ల రాక్షసత్వం చూపించుకుంటున్నారు. భర్తే కదా.. భరించుకుంటాం పోదాం అనే మహిళలు కూడా ఇంకా చాలామంది ఉన్నారు. అలాంటి వారు ఉన్నంత కాలం.. ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. పెళ్లైతే జీవితం మొత్తాన్ని తీసుకెళ్లి భర్త కాళ్లముందు పెట్టాలి అనుకునే చాలామంది ఆలోచన మారాలి. స్వాంతంత్ర్య ఆలోచన ఉండాలి. తప్పు చేస్తే ధైర్యంగా ఎదిరించగలగాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version