భార్యను చంపాడని భర్తకు ఏడేళ్లు జైలు శిక్ష.. ఇప్పుడు ప్రతక్షమైన భార్య..!!

-

రాజస్థాన్​లో ఓ షాకింగ్​ ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది. భార్యను చంపిన కేసులో ఓ వ్యక్తి ఉత్తర్​ప్రదేశ్​లో ఏడేళ్లుగా జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. కాగా.. చనిపోయింది అని అనుకున్న మహిళను.. రాజస్థాన్​లో ఇటీవల పోలీసులు గుర్తించారు. అంటే చేయని తప్పుకు పాపం ఆ భర్త ఏడెళ్లుగా శిక్ష అనుభవించాడు.. ఇంతకీ ఏం జరిగిందంటే..
సోను అనే వ్యక్తికి 2015లో ఆర్తి అనే మహిళతో వివాహమైంది. కొన్ని రోజుల తర్వాత.. సోను పేరు మీద ఉన్న భూమిని తన పేరు మీద రాయించుకునే ప్రయత్నం చేసింది ఆర్తి. డబ్బులు కూడా కావాలని డిమాండ్​ చేసింది. వీటికి సోను ససేమిరా అన్నాడు. ఈ ఘటన జరిగిన 8 రోజుల తర్వాత.. ఆర్తి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆర్తిని చాలా చోట్ల వెతికాడు సోను. కానీ ఫలితం లేదు..
సీన్‌ కట్‌ చేస్తే.. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత.. మథురలోని మగోరా చెరువులో ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. పోస్టుమార్టం నిర్వహించకుండానే.. మృతదేహానికి హడావిడిగా అంత్యక్రియలు నిర్వహించారు. తన బిడ్డ కనిపించడం లేదని.. ఆరు నెలల తర్వాత ఆర్తి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులకు కనిపించిన మహిళ మృతదేహానికి సంబంధించిన దస్తులు, ఫొటోలు ఆ వ్యక్తికి చూపించారు. ఆమె తన బిడ్డే అని తండ్రి సూరజ్​ ప్రసాద్​ గుప్తా పోలీసులకు చెప్పాడు. అంతే.. సోను సైనితో పాటు అతని బంధువు గోపాల్​ సైని.. తన బిడ్డను చంపేశారని ఆరోపించాడు.
రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని సోను, గోపాల్​ను అరెస్ట్​ చేశారు. నేను చేయలేనది సోను ఎంత మొత్తుకున్నా వినలేదు.. చేయని తప్పుకు ఏడేళ్ల పాటు జైలు శిక్షను అనుభవించారు.
తాను ఎలాంటి తప్పు చేయలేదని సోను చెప్పినా ఎవరూ వినలేదు. ఇంతలో.. ఆర్తి బ్రతికే ఉందన్న అనుమానం సోనులో బాగా పెరిగింది. తాను తప్పు చేయలేదని తనకు తెలుసు. ఈ క్రమంలోనే.. తన బంధువుల చేత ఆమెను వెతికి పట్టుకునే ప్రయత్నం చేశాడు. చివరికి.. ఆమె రాజస్థాన్​లో ఉంటోందని తెలుసుకున్నాడు. ఈ విషయాన్ని దౌసలోని మెహందీపూర్​ బాలాజీ పోలీస్ స్టేషన్​లోని అధికారులకు చెప్పాడు. చివరికి పోలీసులు ఆ మహిళను గుర్తించారు. చేయని తప్పుకు ఏడేళ్లుగా శిక్ష అనుభవిస్తున్న సోను, గోపాల్​లు.. ఇటీవలే బెయిల్​పై విడుదలయ్యారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని వారిద్దరు కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version