హుజూరాబాద్ బైపోల్ దగ్గర పడుతున్నాయి. ఇప్పటికే పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీల నుంచే కాకుండా ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. ఈనెల 8 వరకే నామినేషన్ల గడువు ముగిసింది. దాదాపు 61 మంది 92 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ముందు జాగ్రత్తగా కొంతమంది రెండు రెండు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్ల స్క్రూటినీ 11 తారీఖు కావడంతో అధికారులు ప్రతీ నామినేషన్ ను క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల మేరకు వచ్చిన నామినేషన్లను మాత్రమే గుర్తించారు. సక్రమంగా లేని నామినేషన్లను రిజెక్ట్ చేయనున్నారు.
హుజూరాబాద్ బైపోల్ : 18 మంది నామినేషన్ల తిరస్కరణ
-