హుజూర్‌నగర్ ఎన్నికల కౌంటింగ్‌లో ఇప్పటి వరకూ మొత్తం పది రౌండ్లు పూర్తయ్యాయి. ఈ రౌండ్ పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి 20,100 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికొచ్చిన సైదిరెడ్డి అభిమానులు, కార్యకర్తలు, టీఆర్ఎస్ శ్రేణులకు అభివాదం చేశారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డిని కలిసేందుకు సైదిరెడ్డి వెళ్లారు. కాగా.. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి పోలింగ్ వరకూ మంత్రి జగదీషే అన్నీ దగ్గరుండి చూసుకున్న సంగతి తెలిసిందే.
ఇక 10వ రౌండ్‌కే సైదిరెడ్డి 20,100 ఓట్ల మెజార్టీతో దూసుకుపోతున్నారు. తొలి రౌండ్ నుంచి ఎనిమిది రౌండ్ వరకూ టీఆర్ఎస్ అభ్యర్థే ముందంజలో ఉన్నారు. కాగా.. టీఆర్ఎస్ నేతలు మాత్రం 35 వేల మెజార్టీ పక్కా అని చెబుతున్నారు. కాగా మధ్యాహ్నం 2 గంటలకు పూర్తిస్థాయి ఫలితం రానుంది. కాంగ్రెస్ ఇక్కడ వరుసగా మూడుసార్లు గెలిచినా ఆ రికార్డు బ్రేక్ చేసి మరీ కొత్త రికార్డు క్రియేట్ చేస్తూ టీఆర్ఎస్ ఘనవిజయం సాధించబోతోంది.