హైదరాబాద్ మహానగరంలో మరో వేడుకకు సిద్ధమైంది. తొలిసారిగా మైదానంలో రెండు డిజిటల్ మీడియా టైకూన్స్ తలబడుతున్నాయి.యూసఫ్ గూడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా డిజిటల్ మీడియా క్రికెట్ టోర్నమెంట్ జరగనుంది. ఆదివారం సా.7 గంటల నుంచి రా.11 గంటల వరకు ఈ టోర్నీ జరనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్న ఆర్గనైజర్స్ ఈవీ స్పోర్ట్స్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. నిత్యం ప్రజల కోసం సమాచారం సేకరించి అందిస్తున్న జర్నలిస్టులు శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉండేందుకు ఇటువంటి క్రీడలు ఉల్లాసాన్ని ఇస్తాయన్నారు.అందుకు చొరవచూపిన డిజిటల్ మీడియా నిర్వాహకులకు మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలిపారు.
డిజిటల్ మీడియా ప్రీమియర్ లీగ్..
తొలిసారిగా మైదానంలో తలబడుతున్న డిజిటల్ మీడియా టైకూన్స్
యూసఫ్ గూడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా డిజిటల్ మీడియా క్రికెట్ టోర్నమెంట్
ఈరోజు సా.7 గంటల నుంచి రా.11 గంటల వరకు
టోర్నమెంట్ నిర్వాహకులు ఈవీ స్పోర్ట్స్ ను అభినందించిన మంత్రి పొన్నం ప్రభాకర్… https://t.co/khH9dx4pcU pic.twitter.com/PsGtOeqQha
— BIG TV Breaking News (@bigtvtelugu) November 24, 2024