కరోనా వ్యాప్తి నివారణలో మాస్క్‌లకు, అందులోనూ నాణ్యమైన ఎన్95 మాస్క్‌లకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఎన్95 ధర ఎక్కువ కావడంతో సామాన్యులకు అందుబాటులో లేని పరిస్థితి. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలోని ఐఐటీకి చెందిన సెంటర్ ఫర్ హెల్త్‌కేర్ ఎంట్రిప్రెన్యూర్‌షిప్(సీఎఫ్‌హెచ్ఈ) ప్రోత్సహిస్తున్న యూ సేఫ్ హెల్త్‌కేర్ అనే స్టార్ట్ అప్ కొత్త తరహా మాస్క్‌ను రూపొందించింది.
ఎన్95 తరహాలో దాదాపుగా అంతే సామర్థ్యంతో పనిచేయడం వీటి ప్రత్యేకత. ప్రత్యేకంగా రూపొందించిన వస్త్రంతో తయారుచేసిన ఈ మాస్క్ 3 మైక్రాన్ల స్థాయి రేణువులను 98% వరకూ వడపోస్తుందని, చాలా తక్కువ గా ఉంటుంది అని ఐఐటీ ప్రతినిధులు తెలిపారు. ఈ మాస్క్‌లను కనీసం పదిసార్లు ఉతికి వినియోగించుకునేలా రూపొందించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు.యూఎస్9 పేరుతో ఆ మాస్క్‌లను విడుదల చేశారు. గాంధీ, ఒస్మానియా, ఫీవర్ హాస్పిటల్స్‌లో పనిచేసే వైద్యులు ఆ మాస్క్‌లను టెస్ట్ చేశారు. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఎన్95 మాస్క్‌ల కన్నా తక్కువ ధరకే యూఎస్9 మాస్క్‌లను విక్రయించనున్నారు.మాస్క్‌లో డ్యుయల్ మోడ్‌కు చెందిన రీయూజబుల్, రీప్లేసబుల్ ఫిల్టర్లు ఉన్నాయి. సౌత్ ఇండియా టెక్స్‌టైల్ రీసర్చ్ అసోసియేషన్ కూడా మాస్క్ ఫిల్ట్రేషన్ క్యాట్రిడ్జ్‌లకు సర్టిఫికెట్ ఇచ్చింది. అతి తక్కువ కి ఎక్కువ లాభాలు ఇచ్చే మాస్క్ గా చరిత్రలో ఉంటుంది అని ఐఐటీ ప్రతినిధులు అన్నారు.