ఏపీ మంత్రి నారా లోకేశ్ చేసిన ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఆయన చదువు అనంతరం నేరుగా రాజకీయాల్లోకి రాలేదని.. పాల వ్యాపారం చేసేవాడిని అని చెప్పుకొచ్చారు. శుక్రవారం తన నియోజకవర్గమైన మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘నేను రాజకీయాల్లోకి రాకముందు పాల వ్యాపారం చేసే వాడిని. గోసేవ చేస్తే ఆ దేవునికి సేవ చేసినట్లే.గో సంరక్షణ అనేది మనందరి బాధ్యత. అందుకే నేను మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిచాక గోశాలను ప్రారంభించాను’ అని మంత్రి నారా లోకేశ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం రాజకీయవర్గాల్లో ఆసక్తిగా మారాయి.