అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీకి అక్కడ ఘన స్వాగతం లభించింది. భారత కాలమానం ప్రకారం నేటి తెల్లవారుజామున వెస్ట్ వింగ్ లాబీలో భారత ప్రధాని నరేంద్రమోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఘనస్వాగతం పలికారు.
అనంతరం ఇరుదేశాల అగ్రనేతలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ..‘మిమ్మల్ని చాలా మిస్సయ్యా’ అంటూ మోదీతో వ్యాఖ్యానించారు. నాకు కూడా మిమ్మల్ని చూడటం ఆనందంగా ఉందని భారత ప్రధాని బదులిచ్చారు. అనంతరం వీరిద్ధరి మధ్య కీలక అంశాల మీద చర్చలు జరిగాయి. అయితే, మోడీ కూర్చునే కుర్చీని యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి లాగి మరీ కూర్చోబెట్టినట్లు ఓ వీడియో వైరల్ అవుతోంది. భారత ప్రధానికి ఇంత గౌరవం దక్కడం ఇదే తొలిసారి అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
https://twitter.com/ChotaNewsApp/status/1890251860851994755