సీఎం కేసీఆర్‌, ప్రోత్సాహంతో ఈ స్థాయికి చేరాను : నిఖత్‌ జరీన్‌

-

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు గాను నిఖత్ జరీన్ నామినేట్ కాగా.. వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను ఈ అవార్డును అందుకున్నది. దేశ రాజధాని ఢిల్లీలో బీబీసీ ఇండియన్‌ స్పోర్ట్స్‌ వుమన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది. ఈ అవార్డుకు వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను, రెజర్లు సాక్షి మాలిక్‌, వినేశ్‌ ఫోగట్‌, షట్లర్‌ పీవీ సింధు, బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ నామినేట్‌ అయ్యింది. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆర్‌ఎల్‌డీ జాతీయ అ ధ్యక్షుడు, ఎంపీ జయంత్‌ చౌదరి, ఆర్‌జీడీ ఎంపీ మనోజ్‌ ఝుజే, జేడీయూ మాజీ ఎంపీ కేసీ సింగ్‌, ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ హాజరయ్యారు. కార్యక్రమంలో నిఖత్‌ జరీన్‌ తరఫున ఆమె తండ్రి ఎండీ జమీల్‌ హాజరయ్యారు.

ఈ సందర్భంగా వేదికపై భావోద్వేగానికి గురయ్యారు. నిఖత్‌ జరీన్‌ ఈ స్థాయిలో ఉండడానికి సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్సీ కవిత ప్రోత్సాహం, సహకారమే ప్రధాన కారణమన్నారు. ఒక తండ్రిగా నేను చేసింది కొంతేనన్న జమీల్‌, సీఎం కేసీఆర్‌, కవిత సహకారం లేకపోతే నిఖత్ జరీన్ ఈ స్థాయికి వచ్చేది కాదన్నారు. జమీల్ అహ్మద్ ప్రసంగానికి సభికులు చప్పట్లతో హర్షధ్వానాలు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ జరీన్ అంతర్జాతీయ, జాతీయ వేదికల మీద జరిగిన అనేక బాక్సింగ్ పోటీల్లో సత్తా చాటింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version