నా భార్యను అవమానించినప్పుడు ఎంతో బాధపడ్డా: చంద్రబాబు

-

మరికొన్ని నెలల్లో లోక్ సభ,అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేడర్‌ను సమాయత్తపరిచే ఉద్దేశంతో ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “రా-కదలిరా” సభను ఏలూరు జిల్లాలోని చింతలపూడిలో నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి టీడీపీ, జనసేన శ్రేణులు భారీగా తరలివచ్చారు.

 

చింతలపూడిలో టీడీపీ ‘రా.. కదలిరా’ సభలో చంద్రబాబు మాట్లాడుతూ…..తన భార్యను వైసీపీ నేతలు అవమానించినప్పుడు పడిన బాధ జీవితంలో ఎప్పుడూ పడలేదని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. ఎప్పుడూ బయటకు రాని వ్యక్తిపై నిందలు వేసినందుకే ఆవేదన చెందానన్నారు. చింతలపూడి సభలో మాట్లాడుతూ.. ‘సీఎం జగన్ రాష్ట్రంలో ఎవరినీ వదల్లేదు. చివరికి ఆయన చెల్లి, తల్లిని కూడా వదిలి పెట్టలేదు. అందుకే జగన్ను గద్దె దించేందుకు సిద్ధం కావాలి’ అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.రాష్ట్రంలో రూ. 12లక్షల కోట్ల అప్పులు చేసి.. అన్ని వ్యవస్థలను సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశారని తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ప్రభుత్వం పాలనలో ఏ ఒక్కరూ ఆనందంగా లేరని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version