త్వరలోనే పాదయాత్ర.. దమ్ముంటే ఆపండి : కేఏ పాల్

-

క్రైస్తవ మత బోధకుడు.. ప్రజాశాంతి పార్టీ అధినేత.. కేఏ పాల్ పై నిన్న దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే.. తనపై మంత్రి కేటీఆరే దాడి చేయించారని కేఏపాల్ ఆరోపించారు.. అంతేకాకుండా.. టీఆర్ఎస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో 20 సీట్ల కంటే ఎక్కువ రావంటూ వ్యాఖ్యానించారు.. అంతేకాకుండా.. తాను ప్రపంచ శాంతి దూతగా రాలేదని… ప్రజాశాంతి పార్టీ అధినేతగా వచ్చానని.. తెలంగాణలో ఇక కేసీఆర్‌ ఆటలు సాగవని ఆయన మండిపడ్డారు. తనపై దాడి గురించి ఇంకా ప్రపంచ వ్యాప్తంగా తెలియలేదని,   హైదరాబాద్‌లో ఉన్న జడ్జీలు, లాయర్లు అందరూ దీన్ని ఖండిస్తున్నారని, గవర్నర్‌ తమిళిసై తనపై దాడిని ఖండించినట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రపంచం కోసం ఎన్నో యుద్ధాలు చేసిన నేను.. ఎందుకు భయపడుతా… ఇదంతా చేయించిందే ఎస్పీ.. అందుకే డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్తుంటే.. గృహనిర్భంధం చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజా శాంతి పార్టీ 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తోందని తెలిపారు. ఏదైనా ఉంటే 0013106345084 నంబర్‌కు కాల్ చేయొద్దు.. వాట్సాప్‌ చేయండని సూచించారు. మే 28న సాయంత్రం 5 నుంచి 9 గంటలకు పరేడ్‌ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ పెడుతున్నట్లు ప్రకటించారు. అందరూ రండి అని ఆహ్వానించారు. తమకు గ్రౌండ్ పర్మిషన్ ఉందని.. పోలీసులు పర్మిషన్‌ ఇవ్వకపోతే.. కోర్టుకు వెళ్తామన్నారు. త్వరలో పాదయాత్ర చేపడుతానని కేఏ పాల్ ప్రకటించారు. ఎన్టీఆర్‌కే 9నెలలు పట్టింది గెలవడానికి..నాకు 6 నెలలైన పడుతోందని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version