నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. గ్రామీణ బ్యాంకుల్లో 9638 పోస్టులు..

-

దేశంలోని గ్రామీణ బ్యాంకు‌లలో ఖాళీగా ఉన్న‌ ఆఫీస‌ర్‌, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల‌కు గాను ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌ (ఐబీపీఎస్‌) నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. మొత్తం 9638 ఖాళీలు ఉన్న‌ట్లు తెలిపింది. ఈ ఖాళీల‌కు గాను కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ (సీఆర్‌పీ) ఆర్‌ఆర్‌బీ IX నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.

ముఖ్య‌మైన వివ‌రాలు…

* ఈ పోస్టుల‌కు డిగ్రీని అర్హ‌త‌గా నిర్ణ‌యించారు. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంట‌ర్వ్యూల ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. జాతీయ‌స్థాయిలో అభ్య‌ర్థులు ప‌రీక్ష రాయాల్సి ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ పోస్టుల‌కు గాను 836 ఖాళీలు ఉన్నాయి.
* మొత్తం ఖాళీల సంఖ్య‌: 9638
* పోస్టుల వారీగా ఉన్న‌ ఖాళీలు: ఆఫీస్‌ అసిస్టెంట్ (మల్టీ పర్పస్‌) – 4624, స్కేల్‌-1 ఆఫీసర్ ‌- 3800, స్కేల్-2 ఆఫీసర్‌ (జనరల్‌ బ్యాంకింగ్‌ ఆఫీసర్‌-మేనేజర్‌) – 837, స్కేల్‌-2 ఆఫీసర్‌ (ఐటీ) – 58, స్కేల్‌-2 ఆఫీసర్‌ (అగ్రికల్చర్‌) – 100, స్కేల్‌-3 ఆఫీసర్ ‌- 156

దేశవాప్తంగా 43 గ్రామీణ బ్యాంకుల్లో ఉన్న ఖాళీల వివ‌రాలు…

* తెలుగు రాష్ట్రాల్లో 5 గ్రామీణ బ్యాంకుల్లో 836 పోస్టులు ఉన్నాయి. ఏపీలో 366, తెలంగాణలో 470 ఖాళీలు ఉన్నాయి.
* అర్హతలు: డిగ్రీ/సీఏ లేదా లా డిగ్రీ, ఎంబీఏ (మార్కెటింగ్‌)
* వయస్సు: స్కేల్‌-3 పోస్టులకు 21- 40 ఏళ్ల‌ మధ్య ఉండాలి. స్కేల్‌-2 పోస్టులకు 21-32 ఏళ్ల‌ మధ్య, ఇతర పోస్టులకు 18-30 ఏళ్ల‌ మధ్య ఉండాలి.
* ఎంపిక: ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌ ద్వారా (ప్రిలిమ్స్‌, మెయిన్‌)
* పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌
* దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
* దరఖాస్తు దాఖలు చేయడానికి చివరి తేదీ: జూలై 21

ఈ ఖాళీల‌కు సంబంధించి పూర్తి వివరాల కోసం https://www.ibps.in అనే వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version