తెలంగాణలో కరోనా విలయతాండవం చేస్తుంది. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరినీ ఆవహిస్తుంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకునే రాజకీయ నేతలను సినీ తారలను కూడా ఈ మహమ్మారి వదలడం లేదు. ఈ నేపద్యం తెలంగాణ లోని ప్రముఖ రాజకీయ నేతలు వీ హనుమంత్ రావు, హోం మంత్రి మహమూద్ అలీ వంటి ప్రముఖులు సైతం ఈ మహమ్మారి భారీన పడి చికిత్స తీసుకుంటున్నారు. అయితే గత పది రోజుల క్రితం కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంత్ రావుకు అతని భార్యకు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. జూన్ 21 న కరోనా పాజిటివ్ అని నిర్ధారణ జరగగా వారు అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. పది రోజులు క్వారంటైన్ లో ఉన్న ఈ దంపతులు నేడు జులై 1 న డిశ్చార్జ్ అయ్యారు. మరోసారి కరోనా టెస్టులు నిర్వహించిన డాక్టర్లు కరోనా నెగిటివ్ అని తేలడంతో వీరిని డిశ్చార్జ్ చేశారు. దంపతులు ఇద్దరు 60 ఏళ్ళు దాటిన వారే ఇద్దరూ సురక్షితంగా బయటపడటంతో అభిమానులు పార్టీ శ్రేణులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.