ఏ క్రికెటర్లు అయినా సరే వారి సిగ్నల్స్ కోసం ఎదురు చూస్తారు.. వారే అంపైర్లు. ఇంకా అందులో ఒకరు ఐసీసీ అంపైర్ అనిల్ చౌదరి ఒకరు. అయితే కరోనా వైరస్ కారణంగా ఎటువంటి మ్యాచ్ లు జరగకపోవడంతో తన ఇద్దరు కొడుకులను ఉత్తర ప్రదేశ్ లోని సొంత ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాడు. అయితే అతని భార్య మాత్రం ఢిల్లీలోనే చిక్కుకుపోయింది.
దీంతో తన భార్యతో ఫోన్ మాట్లాడేవాడు. అయితే అక్కడ సిగ్నల్ సమస్య ఉండటంతో అక్కడ ఉన్న చెట్లపైకి ఎక్కి మాట్లాడేవాడు. అయితే ఈ సమస్యపై అక్కడ ఒక టెలికం సంస్థను సంప్రదించి తన గ్రామంలో ఒక మొబైల్ టవర్‌ను ఏర్పాటు చేయించాడు. దీంతో తన సమస్యలే కాదు ఆ గ్రామస్థుల సమస్యలు కూడా పరిష్కారం అయ్యాయి.
అంతేకాదు.. ఆ సెల్ టవర్ పెట్టడం వల్ల గ్రామంలోని విద్యార్థులు కూడా ఏ సమస్య లేకుంగా ఆన్లైన్ క్లాసులకు హాజరవుతున్నారు అని గ్రామస్థులకు ఇది ఎంతో పెద్ద విషయం అని అయన చెప్పుకొచ్చారు. కాగా అనిల్ చౌదరి చేసిన పని ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.