కొత్త సర్వీసులుని ఐసీఐసీఐ లంబార్డ్ తీసుకు వచ్చింది. దేశీ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఒకటైన ఐసీఐసీఐ లంబార్డ్ గుడ్ న్యూస్ ని అందించింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. వీడియో కాల్ సర్వీసులని ఐసీఐసీఐ లంబార్డ్ తీసుకు రావడం జరిగింది. దీనితో కస్టమర్స్ కి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కస్టమర్లు వీడియో కాల్ చేసి నేరుగా కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ ప్రొడక్ట్‌ను కొనుగోలు చెయ్యడానికి అవుతుంది.
అలానే ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయి. స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్ టాప్ ద్వారా కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి వీడియో కాల్ ని చెయ్యచ్చు. కోవిడ్ 19 నిబంధనలను అనుసరిస్తూనే సులభంగా పాలసీ కొనుగోలు చెయ్యచ్చు. అయితే వీడియో కాల్ ద్వారా హెల్త్ పాలసీ కొనుగోలు సర్వీసులు అందిస్తున్న మొదట ఇన్సూరెన్స్ కంపెనీ ఇదే.
ఇలా వీడియో కాల్ ద్వారా సేవలు ఉంటే అడ్వైజర్లు కస్టమర్లతో అనుసంధానమై ఉంటారని అన్నారు. అలానే వీడియో కాల్ ద్వారా ఫలితాలు అద్భుతంగా వున్నాయి. ఈజీగా పాలసీని కొనుగోలు చెయ్యడానికి అవుతుంది. దేశవ్యాప్తంగా వేల మంది కస్టమర్లతో వీడియో కాల్ సర్వీసులతో అనుసంధానమై ఉన్నామని కూడా అంది.
నచ్చిన ప్లాన్ ని సెలెక్ట్ చేసుకుని వివరాలు అందించడం ద్వారా వీడియో కాల్ సర్వీసులు పొందొచ్చని కంపెనీ అంది. కనెక్ట్ నౌ లేదంటే బుక్ యువర్ స్లాట్ అనే ఆప్షన్లను కస్టమర్లు వాడి స్లాట్ బుక్ చేస్తే ప్రతినిధులతో మాట్లాడొచ్చు అని అన్నారు. మరోవైపు ఐసీఐసీఐ లంబార్డ్ ఇటీవలనే ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌తో జతకట్టి సైబర్ ఫ్రాడ్ పాలసీలని తీసుకు వచ్చింది.