ఓమిక్రాన్ నిర్ధార‌ణ కు ఐసీఎంఆర్ కొత్త కిట్.. 30 నిమిషాల్లోనే ఫ‌లితం

-

క‌రోనా కొత్త వేరియంట్ అయిన ఓమిక్రాన్ చాలా వేగం గా విస్త‌రిస్తుంది. దీంతో ప్ర‌పంచ దేశాల‌న్ని కూడా అప్ర‌మ‌త్తం అయ్యాయి. క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు పెంచి.. పాజిటివ్ వచ్చిన వారికి ఓమిక్రాన్ నిర్ధార‌ణ ప‌రీక్ష చేయిస్తున్నారు. మ‌న దేశంలో కూడా ఇలాగే చేస్తున్నారు. అయితే ల్యాబ్ ల‌లో ఓమిక్రాన్ వేరియంట్ నిర్ధార‌ణ కావాలంటే క‌నీసం 48 గంట‌లు ప‌డుతుంది. దీంతో ఓమిక్రాన్ అనుమానితులను ట్రెస్ చేయ‌డం క‌ష్టం గా మారింది. దీంతో ఐసీఎంఆర్ ఓమిక్రాన్ వేరియంట్ టెస్ట్ గురించి కొత్త కిట్ ను తయారు చేసింది.

RT – LAMP అనే కిట్ ను తయారు చేశారు. ఈ RT – LAMP కిట్ ద్వారా ఓమిక్రాన్ వేరియంట్ ప‌రీక్ష ఫ‌లితం 30 నిమిషాల లో నే తెలుస్తుంది. ఈ RT – LAMP కిట్ ద్వారా టెస్ట్ చేసుకోవ‌డాని కి నిపుణుల కూడా అవ‌స‌రం లేద‌ని ఐసీఎంఆర్ తెలిపింది. అలాగే RT – LAMP కిట్ చాలా స‌మ‌ర్థ వంతం గా క‌చ్చితం అయిన ఫ‌లితాల‌ను ఇస్తుంద‌ని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. అయితే RT – LAMP కిట్ రాబోయే రెండు నుంచి మూడు వారాల లో అందుబాటు లోకి తీసుకువ‌స్తామ‌ని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version