కాంగ్రెస్, బిజేపి లపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ రామారావు ఫైర్ అయ్యారు. బీజేపీ తెలంగాణకు ఏం పీకిందని ఉద్యమ కారులు ఆ పార్టీ లో చేరతారని ప్రశ్నించారు.హిందూ, ముస్లీం, బాబర్, అక్బర్ తప్ప బీజేపీ కి ఏం తెలుసు ? బీజేపీ ఉడత ఊపులకు భయపడే వారు ఎవ్వరూ లేరని పేర్కొన్నారు. అరెస్టులు చేస్తామని బెదిరిస్తే భయపడే వారు ఎవ్వరూ లేరని.. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామన్నారు.
ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీ లు కడుపు లో పేగులు తెగే దాకా కొట్లాడారని..అలాంటి వారిని.. బిజేపి వాళ్ళు బియ్యం స్మగ్లర్లు అంటున్నారని నిప్పులు చెరిగారు. ఇలాగేనా రాజకీయాలు చేసేది.. సోనియా గాంధీ, మోడీ కి భయపడే వాడు ఇక్కడ ఎవ్వడూ లేడని హెచ్చరించారు. పీసీసీ చీఫ్.. చీప్ గా మాట్లాడుతున్నాడని.. సచివాలయంలో నెల మాళిగలు ఉన్నాయని పిచ్చోడిలా మాట్లాడిన వ్యక్తి పీసీసీ అధ్యక్షుడు అయ్యాడని రేవంత్ కు చురకలు అంటించారు.
ఏదీ పడితే అది.. మాట్లాడే వాడికి నెత్తి లేదు కత్తి లేదని.. బండి సంజయ్ తొండి సంజయ్ లా మారారని ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సంజయ్ కు క్లాస్ పీకానని మాతో స్వయం గా చెప్పాడని.. కేంద్రం తప్పిదాలే వల్లే ధాన్యం కొనుగోలు సమస్య అన్నారు. ఉప్పుడు బియ్యం కొనమని కేంద్రం చెప్పడం వల్లే సమస్యలు వచ్చాయని తెలిపారు.