వింత ఆచారాలు..విచిత్ర సాంప్రదాయాలు.. అంత చిక్కని రహస్యాలు..ఈ ప్రపంచమే ప్రశ్నల నిధి. తెలుసుకోవాలే కానీ చాలా ఉంది. మనకు తెలిసినవి చాలా తక్కువ. కొన్ని తెగల ఆచారాలు, వారు పాటించే పద్ధతులు చూస్తే ఆందోళనకు గురి కావాల్సిందే. జీవితంలో ఒక్కసారి మాత్రమే స్నానం చేయడం అనేది ఒక ఆచారం, పెళ్లైన మూడు రాత్రులు కనీసం టాయిలెట్‌కు కూడా పోకుండా అదే గదిలో భార్యాభర్తలు ఉండాలి అనేది ఒక సంప్రదాయం, అల్లుడికి విషపు పాములను మామ ఇవ్వడం అనేది పద్దతి ఇలాంటి వెరైటీ ఆచారాలన్నీ మనం వినే ఉంటాం. ఇది ఇంకాస్త తేడా..చనిపోయిన వారి శవాన్ని కాల్చుకు తినడం అక్కడి వారి ఆచారమట..మన దగ్గర అయితే ఖననమో, దహనమో చేస్తారు.. వీరు ఫ్రే చేసుకుని తింటున్నారు..
బ్రెజిల్, వెనెజ్వెలాలో ఉండే యానోమామి తెగ ప్రజలు మాత్రం.. ఎవరైనా చనిపోతే.. వారి మాంసాన్ని కాల్చుకొని.. అందరూ కలిసి తింటారు. వీరిని యనాం లేదా సినోమా తెగ అని కూడా పిలుస్తారు. యానోమామి తెగ ఆధునీకరణ, పాశ్చాత్యీకరణ వల్ల అస్సలు ప్రభావితం కావు. ఇప్పటికీ వారు తమ సంస్కృతి. సంప్రదాయాలను అలానే పాటిస్తున్నారు. ఈ తెగలో అంత్యక్రియలు చేసే విధానం చాలా విచిత్రంగా ఉంటుంది.
ఎండోకానిబాలిజం (Endocannibalism) అనే సంప్రదాయం ప్రకారం.. ఈ తెగలో ఎవరైనా మరణిస్తే.. వారి మాంసాన్ని తింటారు. అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌లో నివసిస్తున్న యానోమామి తెగ వారు.. మరణం తర్వాత శరీరం ఆత్మను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని బలంగా నమ్ముతారు. మృతదేహాన్ని పూర్తిగా కాల్చిన తర్వాత… ఆ మాంసాన్ని బంధువులు తింటే.. అప్పుడు వారి ఆత్మకు శాంతి లభిస్తుందని వారి నమ్మకం.
యానోమామీ తెగలో ఎవరైనా మరణిస్తే వారిని ఖననం చేయరు. విలపిస్తూ.. పాటలు పాడుతూ.. తమ బాధను వ్యక్తం చేశారు. అనంతరం మృతదేహాన్ని కాల్చి.. బంధువులంతా ఒక్కచోట కూర్చొని ఆ మాంసాన్ని తింటారు. ఇది కాస్త కష్టమే అయినప్పటికీ… తమ వారి ఆత్మ శాంతించాలంటే ఇలానే చేయాలట.
ఆస్ట్రేలియా ఖండంలో ఉన్న న్యూ గినియాలో కూడా ఇలాంటి తేగే ఉంది. అదే అస్మత్ తెగ. ఈ ప్రజలు శత్రువును చంపి..వారి మాంసాన్ని వండుకుని తింటారు. అంతేకాదు మరణించిన వారి ఎముకలను ఆభరణాలుగా ఉపయోగిస్తారట… పుర్రెలను దిండుగా చేసుకొని.. వాటిపైనే నిద్రిస్తారు. వీళ్లు శత్రువుల తలను నిప్పుల కొలిమిలో కాల్చుకొని.. పుర్రెలోని మాంసాన్ని తింటారు. కొన్నిసార్లు పుర్రెలు పగలగొట్టి పాత్రలు తయారు చేస్తారు. వాటిలోనే ఆహారం తింటారు. వారి ఎముకలను కూడా పండగలు, ఇతర కార్యక్రమాల్లో వినియోగిస్తారు. వామ్మో మస్త్ డేంజర్ ఉన్నారు కదా..!
పండుగ సమయంలో శత్రువుల పుర్రెలను.. పిల్లల పాదాల మధ్య ఉంచుతారు. ఇలా చేయడం వల్ల శత్రు శక్తి తమ పిల్లలకు బదిలీ అవుతుందని వారి నమ్మకం. శత్రువు వెన్నెముక, దిగువ భాగాన్ని తమతో పాటు ట్రోఫీలాగా తీసుకువెళతారు. శత్రువు కింది దవడను ఇంట్లో ఉంచడం వల్ల ధైర్యసాహసాలు వస్తాయని విశ్వసిస్తారు.
అస్మత్ తెగలో ఎవరైనా చనిపోతే… వారి మృతదేహాన్ని చాలా హీనంగా పరిగణిస్తారు. చనిపోతున్న వ్యక్తి గొంతు కోసి.. అతని మెదడును, కళ్లను బయటకు తీస్తారు. ఇది దుష్టశక్తులను దూరం చేయగలదని వారి నమ్మకం.
ఇలాంటి భయంకరమైన తెగలు ఇంకా ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. మనిషి టెక్నాలజీ అంటూ ఎంతో ముందుకెళ్తుంటే వీళ్లేంటో వీళ్ల నమ్మకాలు ఏంటో.. ఇలాంటి వారిని ఏ ప్రభుత్వం పట్టించుకోదా..పోని వారికి మంచి చేద్దామని ఎవరైనా వెళ్లినా వీళ్లు వినరు. మొత్తం మనిషి జాతికే వ్యతిరేకంగా ఉన్నారు. అసలు ఇలాంటి వారిని మార్చడం ఎలా..? ఒక వ్యక్తి చనిపోయాడంటే వారికి ఏదైనారోగం ఉంటే..అలాంటి బాడీని తినడమేంటి..? వైరస్‌లు రావా.? ఈ ప్రపంచానికి దూరంగా ఎటైనా వెళ్లాలని మనకు అప్పడప్పుడు అనిపిస్తుంది. ఇలాంటి తెగల గురించి తెలిసినప్పుడు మనం చాలా సేఫ్ ప్లేస్‌లో ఉన్నాం అనిపిస్తుంది కదా..! వెళ్తే వెళ్లారు..పోయి పోయి ఇలాంటి ప్రాంతాల్లోకి మాత్రం వెళ్లకండే!!