ఏపీలో అమరావతి పేరు చెప్పి మళ్లీ ఎన్నికలు రావొచ్చని కొందరు.. కనీసం 23 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావొచ్చని మరికొందరు చెబుతున్న సంగతి తెలిసిందే. ఆ రెండిటింలో ఏది జరగాలన్నా అది జగన్ – చంద్రబాబుల చేతిలో ఉంది. మొత్తం అసెంబ్లీని రద్దుచేయాల్సిన అవసరం జగన్ కు లేదనేది క్లారిటీ ఉంది కాబట్టి… ఇక మిగిలింది బాబు చిత్తశుద్ధి మాత్రమే! నిజంగా బాబు తన చిత్తశుద్ధిని నిరూపించుకునే క్రమంలో భాగంగా… 23మందితో రాజినామాలు చేయించేస్తే… ఉప ఎన్నికలు వస్తాయి! అప్పుడు పవన్ పరిస్థితి ఏమిటి?
అవును… నిజంగా అమరావతిపైనా, అక్కడ స్థాలాలిచ్చిన రైతులపైనా బాబు చెబుతున్న మాటలు నిజమే అయితే… కచ్చితంగా రాజినామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్తారనేది విశ్లేషకుల మాట! మరి అదే జరిగితే… ఆ ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీ – జనసేన కూటమి పోటీలో పాల్గొంటాయి. అప్పుడు పవన్ కూడా ఎక్కడో ఒక చోట తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి? అప్పుడు పవన్ గెలిస్తే భవిష్యత్ ఏమిటి… మరోసారి పరాజయం పాలయితే భవిష్యత్ ఏమిటి…? ఇప్పుడు జనసైనికుల మధ్య హాట్ టాపిక్ ఇదే!
ఉప ఎన్నికలు జరిగి వాటిలో బీజేపీ – జనసేన కూటమినుంచి పవన్ ఒక చోట పోటీ చేసి గెలిస్తే… కచ్చితంగా 2024 ఎన్నికల్లో ఆ కూటమి నుంచి సీఎం క్యాండిడేట్ అయ్యే అవకాశాలు పవన్ కు పుష్కలంగా ఉండొచ్చు. ఇప్పటికే సోము వీర్రాజు సగం క్లారిటీ ఇచ్చారు కూడా! అలా జరగకుండా… పవన్ మరోసారి ఓటమి చెందితే! కన్ ఫాం… బీజేపీకి ఇకపై సీఎం క్యాండిడేట్ విషయంలో క్లారిటీ వచ్చినట్లే… వారు పూర్తిగా బీజేపీ క్యాండిడేట్ నే కన్ ఫాం చేసేసుకోవచ్చు అనేది విశ్లేషకుల మాట!
అసలు ఈ ఎన్నికల్లో పవన్ పోటీ చేస్తారా? మరో కొత్త ప్రశ్న!! చేయకపోవడమే బెటర్… కొందరు అభిమానుల మాట! ఎందుకంటే… 2019 ఎన్నికలు జరిగి ఇప్పటికి ఏడాదిన్నర కావొస్తోన్నా… ఈ గ్య్యాప్ లో పవన్ కొత్తగా సంపాదించుకున్న ప్రజామద్దతు ఏమీ లేదనే చెప్పాలి! మహా అయితే బీజేపీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా మెలగడం మినహా వ్యక్తిగతంగా పోగేసుకుందేమీ లేదు! అలాంటప్పుడు నోటాకు పోటీ ఇవ్వడం తప్ప పవన్ కు ఒరిగేదేముంటుంది? పవన్ కు క్లిష్ట పరిస్థితి… సంక్లిష్ట పరిస్థితి!