జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ఎండ గడుతూనే ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం విషయంలో అదే విధంగా అమరావతి రాజధాని విషయంలో చాలా సందర్భాలలో వైఎస్ జగన్ ని టార్గెట్ చేసుకుని భయంకరమైన విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయినా ఎక్కడా కానీ జగన్ ముందు నుండి పవన్ తనపై చేసిన వ్యాఖ్యలకు పెద్దగా రియాక్ట్ అయిన దాఖలాలు లేవు. అయితే మరోపక్క మాత్రం వైఎస్ జగన్ …పవన్ అన్నయ్య చిరంజీవితో సన్నిహిత సంబంధాలు మంచిగానే ఉండేటట్లు వ్యవహరించారు.
చాలా సందర్భాలలో చిరంజీవితో ఆప్యాయంగా జగన్ మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఇటీవల ఢిల్లీ పర్యటన వైఎస్ జగన్ చేపట్టిన తర్వాత రాజ్యసభ కి వైసీపీ పార్టీ తరుపున చిరంజీవిని జగన్ పంపించ బోతున్నట్లు వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. దీంతో ఇటువంటి సమయంలో చిరంజీవి వైకాపా లో చేరితే ఏం జరుగుతుంది అన్న చర్చ రాష్ట్రంలో మరియు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తుంది.
అయితే చిరంజీవి వైసీపీలో చేరితే కనుక అది చిరంజీవికి పాజిటివ్ గానే అవుతుందని ఎటొచ్చి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఆటలో అరటిపండు లాగా మిగిలిపోతాడు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంతేకాకుండా కొత్త గొప్పో జనసేన పార్టీకి ఉన్న కాపు ఓటుబ్యాంకు మొత్తం జగన్ వైపు మళ్ళుతుంది అని విశ్లేషిస్తున్నారు. ఇదే తరుణంలో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా…ఇటీవల బీజేపీ తో పవన్ చేతులు కలపడంతో కొంత నిరుత్సాహానికి గురి కావటంతో చిరంజీవి వైసీపీ లో చేరితే ఖచ్చితంగా పవన్ అభిమానులు కూడా జగన్ కి అనుకూలంగా ఉంటారన్న విశ్లేషణలు కూడా వినబడుతున్నాయి.