ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని చేపట్టి ఎదురులేని పార్టీగా దూసుకుపోతున్న వైసీపీ కి సొంత పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం మాత్రం రోజురోజుకు ఇబ్బందికరంగా మారిపోతున్న విషయం తెలిసిందే. ప్రతిసారి పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు రఘురామకృష్ణంరాజు. ఇక ఇప్పుడు మరో సారి పార్లమెంటరీ నేత మిథున్ రెడ్డి పై విమర్శలు చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన రఘు రామ … వైసీపీ పార్లమెంటరీ నాయకుడు మిథున్ రెడ్డి ఎప్పుడైనా పార్లమెంటులో రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడారా అంటూ ప్రశ్నించారు.
ఇప్పటివరకు ఒక్క ప్రత్యేక హోదా మినహా ఏ అంశంపైన కూడా వైసీపీ పార్లమెంటరీ నాయకుడు మిథున్ రెడ్డి పార్లమెంటులో మాట్లాడలేదని విమర్శలు చేశారు రఘురామ. ఒకవేళ పార్లమెంటరీ నాయకుడి కోసం ఈ ఎన్నిక పెడితే మిథున్ రెడ్డి కి కనీసం రెండు మూడు ఓట్లు తప్ప ఎక్కువ రావు అంటూ ఎద్దేవా చేశారు. అలాంటి ఎన్నిక పెడితే ఓట్లు అన్నీ తనకే వస్తాయని ధీమా వ్యక్తం చేశాడు. పార్టీ అంటే కులం మతం కాదు అంటూ తెలిపిన రఘురామ… మీ కులస్తులకు మతస్తులకే అన్ని పోస్టుల అంటూ ప్రశ్నించారు.