ఈఎంఐ చెల్లించేసారా…? ఇలా వెనక్కి తీసేసుకోండి…!

-

కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించారు. ఈ వైరస్ ను అరికట్టేందుకు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకుండా ఉండాలని అన్ని ప్రభుత్వాలు ప్రజలకు సూచిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి అందరి నుండి సహాయ సహకారాలు అందుతున్నాయి. దీనిలో భాగంగా బ్యాంకులు కూడా తమ వంతు సహకారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI కోవిడ్ 19 రెగ్యులేటరీ ప్యాకేజీలో భాగంగా ఈఎంఐలపై మూడు నెలలు మారటోరియం విధించిన విషయం తెలిసిందే. ఈఎంఐలపై ఆర్‌బీఐ మారటోరియం విధించడానికన్నా ముందే మీరు ఈఎంఐలు చెల్లించినట్లైతే వెనక్కి తీసుకోవచ్చు అని ఎస్‌బీఐ అంటున్నారు. అన్ని బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు దీనికి ఆమోదం తెలుపుతున్నాయి . స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కూడా మారటోరియం అమలు చేస్తున్నట్టు ప్రకటించింది.

2020 మార్చి 1 నుంచి 2020 మే 31 వరకు అన్ని టర్మ్ లోన్ల ఈఎంఐలు, వడ్డీని వాయిదా వేసేందుకు చర్యలు తీసుకుంది. రీపేమెంట్ పీరియడ్‌ను మూడు నెలలు పొడిగించినట్టు అధికారికంగా ప్రకటించింది. ఎస్‌బీఐలో టర్మ్ లోన్స్ అంటే హోమ్, పర్సనల్, ఎడ్యుకేషన్, వెహికిల్ లోన్ లాంటి రుణాలు తీసుకున్నవారు మూడు నెలలపాటు ఈఎంఐలు చెల్లించకపోయినా పర్వాలేదు. అంతే కాకుండా మార్చి1 నుంచి ఇప్పటి వరకు ఎవరైనా ఈఎంఐలు చెల్లించినట్టైతే బ్యాంకుకు దరఖాస్తు చేసి వెనక్కి తీసుకోవచ్చు. ఎలా వెనక్కి తీసుకోవచ్చు అనేదాన్ని ఎస్‌బీఐ వివరించింది.

1. ఈఎంఐ మారటోరియం వాడుకోవద్దనుకునే కస్టమర్లు వారి అకౌంట్ నుంచి ఈఎంఐ డిడక్ట్ అవుతుంది. లేదా కస్టమర్లు ఈఎంఐ చెల్లిస్తే చాలు.

2. ఈఎంఐ మారటోరియం కోరుకునేవారు దరఖాస్తు చేసుకోవాలి. సాధారణంగా ఈఎంఐలు నేషనల్ ఆటోమెటెడ్ క్లియరింగ్ హౌజ్-NACH ద్వారా ఆటో డెబిట్ అవుతాయి. అందుకే (Annexure-II) దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి (Annexure-III) లో ఉన్న ఇమెయిల్ ఐడీకి పంపాల్సి ఉంటుంది.

3. ఇప్పటికే అంటే మార్చి 1 నుంచి ఇప్పటి వరకు ఈఎంఐ చెల్లించినట్టైతే, (Annexure-I) అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసి (Annexure-III) లోని ఇమెయిల్ ఐడీకి పంపాలి.

https://bank.sbi/stopemi

Read more RELATED
Recommended to you

Exit mobile version