కే‌టి‌ఆర్ సి‌ఎం అయితే జరిగేది ఇదే .. !

-

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఆధ్వర్యంలో భారీ మెజార్టీ స్థానాలు గెలవడం జరిగింది. బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఈ ఎన్నికల్లో జాతీయ పార్టీలు.., టీఆర్ఎస్ పార్టీ ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్ మరియు బి.జె.పి పార్టీల అడ్రస్ లు గల్లంతయ్యాయి. అద్భుతంగా టిఆర్ఎస్ పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో ముందుండి కేటీఆర్ నడిపించారని టిఆర్ఎస్ పార్టీ మంత్రులు మరియు పెద్దలు కేటీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించడం జరిగింది.

ఇదే తరుణంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు వార్తలు కూడా ఇటీవల వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో మున్సిపల్ ఎన్నికలు అయ్యాక టిఆర్ఎస్ పార్టీ గెలుపును ఉద్దేశించి కేటీఆర్ గెలిచిన నేతలకు సూచనలు ఇవ్వటం జరిగింది. తెలంగాణలో 119 మున్సిపాలిటీలను టీఆర్ఎస్ గెలుచుకోవడం ఓ చరిత్ర అని రాష్ట్రంలో పట్టణీకరణ పెరుగుతోందని అందుకు తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్లానింగ్ తో ముందుకు సాగుతోందని కేటీఆర్ తెలిపారు.

 

అంతేకాకుండా కొత్త చట్టానికి అనుగూణంగా అంతా పని చేయాలని… లేకపోతే పదవులు పోతాయని కేటీఆర్ హెచ్చరించారు. రియల్టర్లు నిబంధనలు అతిక్రమించి లే అవుట్లు వేస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలని చట్టప్రకారం టిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేశారు. మొత్తంమీద చూసుకుంటే కేటీఆర్ చట్టాన్ని గౌరవిస్తూ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన నేతలకు దిశానిర్దేశం చేయడంతో..కేటీఆర్ సీఎం స్థానంలో కూర్చుంటే కచ్చితంగా లా అండ్ ఆర్డర్ పగడ్బందీగా జరగటం గ్యారెంటీ అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version