ఎన్టీఆర్ చరిత్ర సృష్టిస్తే..కెసిఆర్ హిస్టరీ తో పాటు జాగ్రఫీ సృష్టించారు: మంత్రి కేటీఆర్

-

ఎన్టీఆర్, కేసీఆర్‌ మాత్రమే తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేశారు, ఎన్టీఆర్ చరిత్ర సృష్టిస్తే.. కేసీఆర్‌ హిస్టరీతో పాటు జాగ్రఫీ కూడా సృష్టించారు, కేసీఆర్‌ జీవితం ధన్యమైందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారని గుర్తు చేశారు కేటీఆర్.బీజేపీ చేతిలో అధికారం దేశానికే అందకారంగా మారింది అని అన్నారు. మోడీ పాలనలో దేశాన్ని చీకట్లో నిల్చోపెట్టారు. ఇది NDA ప్రభుత్వం కాదు- NPA ప్రభుత్వం. NPA అంటే నాన్ పర్ఫామింగ్ అసెట్స్ అనాలి అని ఎద్దేవా చేశారు. మతాల పేరుతో కొట్లాడాలి అని ఏ దేవుడు చెప్పిండు? మేరా భారత్ మహాన్ అనే నాయకుడు దేశానికి కావాలి- ఆ నాయకుని తెలంగాణ అందిస్తుందేమో అని అన్నారు మంత్రి కేటీఆర్.

ఉద్వేగాల దేశం కాదు- ఉద్యోగాల దేశం కావాలి.కేసీఆర్ లాంటి టార్చ్ బేరర్ దేశానికి అవసరం అని అన్నారు.దేశానికి ఒక విజనరీ కావాలి టేలివిజనరి కాదు.భారత దేశానికి కేసీఆర్ లాంటి నాయకుడు కావాలన్నారు.మతపిచ్చి- కులపిచ్చి లేకుండా తెలంగాణకు గోల్డెన్ పాలన కేసీఆర్ అందిస్తున్నారన్నారు. దేశ ప్రజల కష్టాలను డబుల్ చేసిన ఘనత మోడీకే దక్కుతుంది అన్నారు మంత్రి కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version