రెండో సారి ఓటు వేయడానికి వస్తే కేసు బుక్ చేస్తాం : సీఈసీ రాజీవ్ కుమార్

-

రెండో సారి ఓటు వేయడానికి వస్తే కేసు బుక్ చేస్తామని  సీఈసీ రాజీవ్ కుమార్ హెచ్చరించారు. తాజాగా ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ని ప్రకటించారు. వాలంటీర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉండకూడదని సూచించారు. బ్యాంకు ఖాతాలు, లావాదేవీలపై ప్రత్యేక మానిటరింగ్ చేస్తామని తెలిపారు.  కులం, మతం పేరుతో ఓట్లు అడగవద్దని సూచించారు. విద్వేష ప్రసంగాలను అనుమతించమని తెలిపారు.

సూర్యస్తమయం తరువాత బ్యాంక్ క్యాష్ వ్యాన్లను సైతం అనుమతించబోమని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో పోస్టుల నియంత్రణకు ప్రత్యేక అధికారులను నియమించనున్నట్టు తెలిపారు. 2100 మంది ఎన్నికల అబ్జర్వర్లు ఉండనున్నట్టు తెలిపారు. దేశంలో 48వేల ట్రాన్స్ జెండర్ ఓటర్లు ఉన్నట్టు తెలిపారు. వికలాంగులకు కూడా ఓటు ప్రమ్ ఆప్షన్ కల్పిస్తున్నామని తెలిపారు. 12 రాష్ట్రాల్లో మహిళా ఓటర్లే ఎక్కువ అని తెలిపారు. ఏప్రిల్ 01వరకు ఓటర్ల మార్పులకు అనుమతి ఇవ్వనున్నట్టు తెలిపారు. వ్యక్తి దూషణలకు పాల్పడకూడదని సూచించారు. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో దాదాపు 3,400 కోట్ల వరకు సీజ్ చేసినట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version