అధికారంలోకి రాక ముందే తమ ఇష్టా రాజ్యంగా విధ్వంసకర చర్యలకు పాల్పడుతున్న మూకలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ రాజమండ్రి ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ సార్కర్ కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.
అలాగే మోరంపూడి ఫ్లై ఓవర్ బ్రిడ్జి శిలాఫలకాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ధ్వంసం చేస్తున్న వీడియోలు, సీసీ పుటేజీ, పెన్ డ్రైవ్ తదితర ఆధారాలను అడిషనల్ ఎస్పీకి ఆయన అందజేశారు.సీతంపేట మూలగొయ్యికి చెందిన సాయి అనే యువకుడిపై తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది మారణాయుధాలతో దాడిచేశారని, బాధితుని తలకు నాలుగు కుట్లు పడ్డాయని ,గాయపడ్డ సాయిని అడిషనల్ ఎస్పీకి చూపించారు. ఇటువంటి విష సంస్కృతి గతంలో రాజమండ్రిలో లేదని మాజీ ఎంపీ భరత్ మండిపడ్డారు.అధికారం ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే చూస్తూ సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు .రాజమండ్రి నగరంలో ప్రశాంత వాతావరణం కొనసాగాలన్నదే తమ అభిలాష అని అన్నారు.