దమ్ముంటే నన్ను సస్పెండ్ చేయండి – పొంగులేటి కీలక వ్యాఖ్యలు

-

మరోసారి బీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. బిఆర్ఎస్ నుంచి తన అనుచరులను సస్పెండ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లను, వీళ్లను సస్పెండ్ చేయడం కాదని.. దమ్ముంటే తనను సస్పెండ్ చేయాలని సవాల్ విసిరారు. మొన్నటి వరకు పార్టీ అన్ని కార్యక్రమాలకు ఆహ్వానించారని, మీ గెలుపు కోసం తనని ప్రాధేయపడ్డారని, కానీ ఇప్పుడు తనకి బిఆర్ఎస్ సభ్యతమే లేదని అంటున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

డిసెంబర్ వరకు పార్టీ కార్యక్రమాలలో తన బొమ్మను ఎందుకు వాడుకున్నారని నిలదీశారు. తన అనుచరుల అభీష్టం మేరకే పార్టీ మారుతున్నట్లుగా చెప్పుకొచ్చారు పొంగులేటి. నేడు అశ్వరావుపేటలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version