కొన్ని కొన్ని సార్లు డబ్బులు లేకపోవడం, ఆర్ధికంగా సమస్యలు రావడం జరుగుతుంది. అటువంటి సమయం లో చాలా మంది లోన్ తీసుకోవాలని అనుకుంటూ వుంటారు. మీరు కూడా ఏదైనా సమస్య తో ఇబ్బంది పడుతున్నారా..? మీరూ లోన్ తీసుకోవాలని భావిస్తున్నారా..? అయితే తప్పక దీని కోసం తెలుసుకోవాలి. ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు వంటి ఐడెంటిటీ డాక్యుమెంట్ల ద్వారా ఈజీగా లోన్ తీసుకొచ్చు.
దీని కోసం మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇక ఎటువంటి ఆలస్యం చేయకుండా ఈ లోన్ ఎలా పొందొచ్చు..?, ఎవరు పొందొచ్చు..? ఇలా ఎన్నో ముఖ్యమైన విషయాలు గురించి తెలుసుకుందాం. మరి ఇక దీని కోసం ఓ లుక్ వేసేయండి. సాధారణంగా ప్రతీ ఒక్కరికీ కూడా ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు వంటి ఐడెంటిటీ డాక్యుమెంట్స్ ఉంటాయి. అయితే మనకి ఉంటే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఇవి కూడా చాలా ముఖ్యమైనవి. అయితే వీటి ద్వారా సులభంగానే రుణం పొందొచ్చు.
దీని కోసం మీరు ఎక్కడికీ వెళ్ళక్కర్లేదు కూడా. మీరు కనుక లోన్ తీసుకోవాలని అనుకుంటే తొలిగా బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీ యాప్‌లోని డౌన్‌లోన్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు లాగిన్ అవ్వాలి. ఇప్పుడు లోన్ కోసం అప్లై చేసుకోవాలి. ఇలాంటి సమయంలో ఆధార్ నెంబర్ కచ్చితంగా అవసరం అవుతుంది.
ఆధార్ ఇకేవైసీ ద్వారా ఈజీ లోన్ ని పొందడానికి వీలు అవుతుంది. అయితే లోన్ తీసుకోవాలని భావించే ప్రతి ఒక్కరికీ సంబంధిత బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీ కచ్చితంగా ఆధార్ ఇకేవైసీ పూర్తి చేసుకోవాలనే నిబంధన ఉంది. ఇది పూర్తి చేస్తేనే లోన్ వస్తుంది. కొన్ని సంస్థలు ఆన్‌లైన్‌లోనే డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయమంటాయి. ఇది ఇలా ఉంటే లోన్ కోసం అప్లై చెయ్యాలంటే సిబిల్ స్కోర్ బాగుండాలి. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే రుణం పొందడం సాధ్యం కాదు. అలాగే ఇన్‌కమ్ డాక్యుమెంట్లు కూడా అవసరం.