96 ఏళ్ళు బతికారు క్వీన్ ఎలిజిబెత్. ఈ అలవాట్లు వల్లే ఆమె 96 ఏళ్ళు బతికారు. ఈ అలవాట్లుని మీరు కూడా అలవాటు చేసుకుంటే మీరు కూడా ఎక్కువ కాలం బతకచ్చు. మరి క్వీన్ ఎలిజిబెత్ కి ఎలాంటి హేబిట్స్ వున్నాయి అనేవి చూద్దాం.
అల్పాహారం తీసుకోవడం:
క్వీన్ ఎలిజిబెత్ ఉదయం 8:30 గంటలకు అల్పాహారం తీసుకునేవారు మంచి బ్రేక్ ఫాస్ట్ ని తీసుకుంటే ఎక్కువ కాలం బతకచ్చు.
పెంపుడు జంతువులు ఉండడం:
ఎలిజిబెత్ కి పెట్స్ అంటే చాలా ఇష్టం. పెట్స్ ఉండడం వలన మనకి ప్రశాంతంగా ఉంటుంది. బీపీని తగ్గించడానికి ఒత్తిడిని దూరం చేయడానికి కూడా పెంపుడు జంతువులు సహాయపడతాయి.
హార్స్ బ్యాక్ రైడింగ్:
గుర్రం స్వారీ చేసేవారు ఆమె. నిజానికి ఆమె జీవితంలో ఇవి భాగం అని చెప్పొచ్చు.
టీ టైం:
షుగర్ లేకుండా ఆమె టీ ని తీసుకునేవారు ఇది నిజంగా ఆరోగ్యకరమైన పద్ధతి ప్రతి ఒక్కరు పాటిస్తే చాలా బాగుంటుంది.
నవ్వడం:
ఎక్కువగా క్వీన్ ఎలిజిబెత్ నవ్వుతూ ఉండేవారు. స్నేహితులతో కూడా ఎక్కువ సేపు నవ్వుతూ ఉండేవారు.
ప్రేమగా రిలేషన్ షిప్ లో ఉండడం:
ప్రిన్స్ ఫిలిప్ మధ్య మరియు ఈమెకి రిలేషన్ షిప్ లో ఎత్తుపల్లాలు ఉన్నాయి కానీ మంచిగా వీళ్ళిద్దరూ క్లోజ్ గా ఉండేవారు.
నేచర్ ని ఎంజాయ్ చేయడం:
ప్రకృతి ని బాగా ఎంజాయ్ చేసేవారు క్వీన్ కూడా. ప్రకృతి మధ్య ఎక్కువ సమయం గడిపితే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఈ అలవాట్లను కనుక కలిగి ఉంటే ఎంతో ఆనందంగా ఉండచ్చు. ఎక్కువ కాలం జీవించచ్చు.