సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ బ్రహ్మానందం గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. తన కామెడీతో తెలుగు ప్రేక్షకులను బాగా అలరించారు బ్రహ్మానందం. తన కామెడీ టైమింగ్ తో ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేశారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కొన్ని సందర్భాలలో బ్రహ్మానందం లేకుంటే సినిమానే ముందుకు సాగేది కాదు అన్నట్లుగా ఉండేది. అయితే బ్రహ్మానందం ప్రస్తుతం వయసు మీద పడుతూ ఉండటంతో సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం పలువురు కమెడియన్ లు రావడంతో బ్రహ్మానందానికి కాస్త అవకాశాలు కూడా తగ్గాయని ఇండస్ట్రీలో టాక్ గా ఉంది.
బ్రహ్మానందం కేవలం ఒక మంచి నటుడిగానే కాకుండా ఆయనలో ఆర్టిస్టు కూడా ఉన్నాడు అని చెప్పవచ్చు. కరోనా సమయంలో బ్రహ్మానందం ఖాళీగా ఉండకుండా తనకు వచ్చిన పెయింటింగ్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. బ్రహ్మానందం ఒక సినిమాకి తీసుకునే రెమ్యూనరేషన్ తో సగభాగాన్ని భూముల పైన ఇన్వెస్ట్మెంట్ చేసేవారట. ప్రస్తుతం ఆ భూముల ధరలు ఇప్పుడు బాగా అధికంగా పెరిగి పోయినట్లు సమాచారం. దాదాపుగా బ్రహ్మానందం ఆస్తి విలువ సుమారుగా 500 కోట్ల రూపాయలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన స్నేహితులు మాత్రం బ్రహ్మానందం కు ఒక దురలవాటు కూడా లేకపోవడం తోనే ఈ రేంజ్ లో ఆస్తులు కూడబెట్టారని తెలియజేశారు.