టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అయితే.. సీఎం కేసీఆర్ జాతీయ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఆయన నేడు చండీఘడ్‌లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో కలిసి రైతు ఉద్యమంలో మరణించిన రైతుల కుటుంబాలను పరామర్శించారు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం తరుపున చెక్కులు అందజేశారు. ఇదిలా ఉంటే.. రైతులను కడతేర్చే పార్టీ బీజేపీ అని..అన్నదాతలను కడుపులో పెట్టుకుని చూసుకునే పార్టీ టీఆర్ఎస్ అని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.
కేంద్రంలోని బీజేపీ సర్కారు నల్లచట్టాల పేరుతో రైతులకు తీరని అన్యాయం చేసిందని, ఏడు వందలకుపైగా రైతుల చావుకు కారణమైందని దుయ్యబట్టారు. ఈ మేరకు ఆదివారం ఆమె ఒక ట్వీట్ చేశారు.బీజేపీ కేంద్ర మంత్రి కొడుకు రైతులను జీపుతో తొక్కించి చంపినా స్పందించని సంస్కృతి కాషాయ పార్టీదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. దేశానికి వెన్నెముక అయిన రైతును కడుపులో పెట్టిచూసుకునే సంస్కృతి సీఎం కేసీఆర్‌దని పేర్కొన్నారు. నల్లచట్టాలపై పోరులో అమరులైన రైతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఛండీగఢ్‌లో చెక్కులు పంపిణీ చేస్తున్న ఫొటోలను కవిత షేర్ చేశారు.