శృంగారం అనేది ప్రతి ఒక్కరు చెయ్యాలని అనుకుంటారు. అయితే కొన్ని సార్లు చెయ్యలేక పోతారు.. దానికోసం ఎన్నో రకాల మందులను వాడుతూ ఉంటారు.. కానీ ప్రయోజనాలు లేక ఆయుర్వేదం వైపు పరుగులు పెడతారు.. ప్రకృతి మనకు ఎన్నో ఔషదగుణాలను కలిగి ఉంటుంది.. ప్రతి సమస్యకు మందులు దొరుకుతాయి. యాలుకలు, లవంగాలు శృంగార సామార్థ్యాన్ని పెంచుతాయి.. ఇప్పుడు లవంగాల వల్ల లైంగిక సమస్యలను ఎలా దూరం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
లవంగాలు పురుషుల్లో కామోద్దీపనం కలిగిస్తాయి. శృంగారంలో పాల్గొనే ముందు ఒక లవంగం మొగ్గను తింటే, అవి శరీరాన్ని వేడెక్కించి,మీ భాగస్వామితో తారస్థాయిలో శృంగారంలో పాల్గొనేలా చేయడంతో పాటు, ఎక్కువసేపు శృంగారం జరిపేందుకు దోహదపడతాయి. అంతేకాదు మగవారిలో స్పెర్మ్ క్వాంటిటీ పెంచడానికి కూడా ఇవి చక్కగా పనిచేస్తాయి కాబట్టి సంతాన ఉత్పత్తిని కూడా అధికంగా కలిగి ఉంటాయి. కాబట్టి లవంగాలను మీరు తగిన రీతిలో తీసుకున్నట్లయితే తప్పకుండా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు..
ఇవే కాకుండా..వయసు పైబడిన కొద్దీ కీళ్ల నొప్పులు సహజంగా వస్తూ ఉంటాయి. అలా కీళ్ల నొప్పులు ఉన్నవారికి లవంగం నూనె చాలా బాగా పని చేస్తుంది. మీకు ఈ లవంగం నూనే అందుబాటులో లేకపోతే లవంగాన్ని మెత్తగా నూరి పేస్టులా చేసి నొప్పి ఉన్నచోట ఆ పేస్టును అప్లై చేస్తే వెంటనే నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.లవంగంలో ఉండే యూజెనాల్ అనే లక్షణము మన కాలేయ ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు దోహదపడుతుంది. కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది.అందుకే రోజు ఒక లవంగం తీసుకోవడం మేలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు..