జిహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఉచిత తాగునీటి పథకానికి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఉచిత తాగునీటి పథకానికి ఆధార్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ప్రకటించిన ఉచిత నీటి పథకం లో…ప్రతి నెల 20 వేల లీటర్ల నీటిని అందిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని వినియోగించుకోవాలి అనుకునేవారు తప్పనిసరిగా మీ ఆధార్ కార్డు నెంబర్ ను ఈ పథకంలో లింకు చేయాల్సి ఉంటుంది. లేకపోతే.. ఉచితం లేనట్లే…! ఒకవేళ ఇంకా ఆధార్ తీసుకోకుంటే.. వెంటనే దరఖాస్తు చేసుకుని దానికి సంబంధించిన రసీదు నెంబరు పేర్కొనవలసి ఉంటుంది.
అయితే ఈ నిబంధన కొత్తగా కనెక్షన్ తీసుకున్న వారికా? ప్రస్తుతమున్న కనెక్షన్ దారులందరికా? అనే విషయంపై జీవో లో స్పష్టత ఇవ్వలేదు. ఈ పథకం ఎప్పటి నుంచి అమలులోకి వస్తుంది? అనే విషయాన్ని జీవోలో పేర్కొనలేదు. ఒకటి కంటే ఎక్కువ ఇల్లు ఉన్న వారి పరిస్థితి ఏమిటి? ఓకే ఇంటికి పథకం వర్తిస్తుందా? లేదా ఎన్ని ఇళ్లను పేర్కొంటే అన్నిటికీ ఉచిత పథకం అమలవుతుంది? అనే దానిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. దీంతోపాటు అపార్ట్ మెంట్ విషయంలోనూ కూడా అనేక అనుమానాలు ఉన్నాయి.సాధారణంగా అపార్ట్ మెంట్ లో ఉమ్మడి నల్ల కలెక్షన్ ఉంటుంది. దాని ద్వారానే అన్ని అన్ని ప్లాట్లకు నీటి సరఫరా జరుగుతుంది.ఒక కనెక్షన్ కి మొదట 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా ఇస్తారా? లేక అన్ని ప్లాట్లకు ఈ పథకం వర్తిస్తుందా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.