బొజ్జ తగ్గాలంటే.. బొజ్జునే ముందు ఈ డ్రింక్స్‌ తాగేయండి.! సెట్‌..!!

-

బరువు పెరగడం అనేది డబ్బులు ఖర్చు పెట్టడం లాంటిదే..ఎప్పుడు ఎలా అయిపోతుందో కూడా తెలియకుండా..ఖర్చైపోతాయి.. అదే తగ్గడం అనేది.. డబ్బు సంపాదించడం లాంటిది.. ఎంతో కష్టపడితే కానీ.. పైసలు వస్తాయి.. ఎంతో కష్టపడితే కానీ పెరిగిన బరువు తగ్గుతుంది. అయితే కష్టాన్ని మరీ కఠినంగా కాకుండా.. కాస్త లాజికల్‌గా, కంట్రోల్‌ చేస్తే.. బరువు తగ్గడం అనేది పెద్ద సమస్య కాదు. బరువు తగ్గడంలో ముందు చేయాల్సింది.. పొట్ట తగ్గించుకోవడం.. ఇది తగ్గితే..సన్నగా కనిపిస్తారు. మరి బొజ్జ తగ్గాలంటే.. ఏం చేయాలి..? వ్యాయామాలే కాదు.. నైట్‌ ఈ డ్రింక్‌ తాగి పడుకున్నా పొట్ట తగ్గించేయొచ్చట..! అవును.. మరి ఇంకెందుకు ఆలస్యం.. అవి ఏంటో చూద్దామా..!

నిద్రకి ఉపక్రమించే ముందు ఈ పానీయాలు తీసుకోవడం వల్ల మంచి నిద్రతోపాటు పాటు కొవ్వు కూడా కరుగుతుంది. శరీరానికి కనీసం 8 గంటల నిద్ర అవసరం అని వైద్యులు చెబుతారు..

పాలు: నిద్రపోయే ముందు ఒక గ్లాసు పాలు తీసుకోవడం వల్ల మంచి నిద్రపట్టడంతో పాటు.. మరుసటి రోజు కాల్షియం అతిగా తినకుండా నిరోధిస్తుంది. జీర్ణక్రియను నెమ్మదించేలా చేస్తుంది. పొట్టను తగ్గించేందుకు ఇది సహకరిస్తుంది.

దాల్చిన చెక్క టీ- దాల్చిన చెక్కతో తయారు చేసిన టీ.. పడుకునే ముందు తాగడం వల్ల బరువు స్థిరంగా తగ్గుతుంది. ఇది తయారు చేయడం కూడా చాలా సులభం. రెండు కప్పుల నీటిలో దాల్చిన చెక్క బెరడు కొంచెం వేసి బాగా మరిగించి తర్వాత వాటిని వడకట్టుకుని తాగడమే. జీవక్రియను పెంచడంలో ఈ టీ చాలా బాగా ఉపయోగపడుతుంది.

ప్రోటీన్ షేక్: క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వాళ్ళు అయితే నిద్రకు ముందు ప్రోటీన్లు కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఇవి కండరాలను సరి చేసి పునరుద్ధరించడానికి ఉపయోగపడతాయి. ఇది ఎక్కువ కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. పేగులను శుభ్రం చేసి ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ద్రాక్ష రసం- నిద్రపోయే ముందు ఒక గ్లాసు తాజా ద్రాక్ష రసం తాగితే శరీరంలోని కొవ్వును కరిగించేందుకు సహాయపడుతుంది. ద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొవ్వును విచ్ఛిన్నం చేయడంలో సహాయపడతాయి. ఇన్సులిన్ స్రావాన్ని నియంత్రించి శరీర సిర్కాడియన్ లయలను అదుపులో ఉండేలా చేస్తుంది.

మెంతి నీళ్ళు- మెంతి నీరు శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. బరువును అదుపులో ఉంచుతుంది. ఇది జీర్ణవ్యవస్థను బలోపేతం చేసి జీవక్రియను పెంచుతుంది. మెంతి గింజలను కనీసం 2-3 గంటలు నీటిలో నానబెట్టి నిద్రపోయే 30 నిమిషాల ముందు క్రమం తప్పకుండా ఆ నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల కచ్చితంగా బరువు తగ్గుతారని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా షుగర్ పేషంట్స్‌ ఇలా చేయడం వల్ల షుగర్‌ కూడా కంట్రోల్లో ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version