సొంత ప్రభుత్వం మీద జడ్చర్చ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వంలో విరాసత్ చేయడానికి ఒక అధికారి రూ.1లక్ష లంచం అడిగాడు. రెవెన్యూ శాఖలో అంత ఘోరంగా అవినీతి ఉన్నది.
మరి మేం ప్రజల తరఫున ప్రశ్నించొద్దా? అని ఎమ్మెల్యే ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. కాగా, ప్రస్తుతం రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.ఎందుకంటే జిల్లా మంత్రిగా ఉన్న మంత్రి పొంగులేటి తీరుతో తమ నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ క్రమంలోనే అతని ఇంట్లో నిన్న 10 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయిన విషయం తెలిసిందే. అందుకు కారణం కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అని జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
సొంత ప్రభుత్వం మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మా కాంగ్రెస్ ప్రభుత్వంలో విరాసత్ చేయడానికి ఒక అధికారి లక్ష రూపాయలు లంచం అడిగాడు
అంత ఘోరంగా అవినీతి ఉంది రెవెన్యూ శాఖలో
మరి మేం ప్రజల తరఫున ప్రశ్నించొద్దా?
Video Credits – YOYO TV pic.twitter.com/f9LrwBJb7n
— Telugu Scribe (@TeluguScribe) February 2, 2025