కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆనందకరమైన, ఆశ్చర్యకరమైన విషయం జరిగిందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో గురజాడ కవితను ప్రస్తావించడం ఆనందకరమైతే.. ఈ ప్రాంతం అభివృద్ధికి కనీస కేటాయింపులు లేకపోవడం బాధాకరం. మా మీద ఆధారపడిన ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు లబ్దిపొందింది కానీ ఏపీకి కనీస ప్రాధాన్యత దక్కలేదు. టీడీపీకి రాజకీయ ప్రయోజనాలు తప్ప రాష్ట్రాభివృద్ధికి ప్రాధాన్యత కాదని తేలిపోయింది. పోలవరం ఎత్తు తగ్గించేసి నిధులు కేటాయించామని చెప్పడం దారుణం అన్నారు.
2014-19 మధ్య ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతోంది. ప్రత్యేక హోదాను ప్రాకేజ్ గా మార్చేయడం వల్ల చాలా ఇబ్బందులు తలెత్తాయి. పోలవరం ఎత్తు కుదింపు పై ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి ప్రశ్నించారు.