హైదరాబాద్ మింట్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఆఖరి తేదీ జూలై 31

-

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్‌ గవర్నమెంట్‌ మింట్‌ హైదరాబాద్‌ శాఖ ఆసక్తి ఉన్న నిరుద్యోగ అభ్యర్థుల నుంచి ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆ కేంద్రంలో ఖాళీగా ఉన్న 11 జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్స్‌ (జేవోఏ), సూపర్‌వైజర్‌ (ఓఎల్‌ – అఫిషియల్‌ లాంగ్వేజ్‌) పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు గాను దరఖాస్తు ప్రక్రియ జూన్‌ 3, 2020 నుంచి ప్రారంభం కాగా జూలై 31, 2020 వరకు గడువు విధించారు.

ముఖ్యమైన వివరాలు…

* పోస్టుల వివరాలు – జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్స్‌ (జేవోఏ), సూపర్‌ వైజర్‌ (ఓఎల్‌-అఫిషియల్‌ లాంగ్వేజ్‌)
* సంస్థ – ఇండియన్‌ గవర్నమెంట్‌ మింట్‌, హైదరాబాద్‌ (ఐజీఎంహెచ్‌)
* విద్యార్హత వివరాలు – ఏదైనా డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అయి ఉండాలి, గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో ఇంగ్లిష్‌ లేదా హిందీ సబ్జెక్టు చదివి ఉండాలి, హిందీ లేదా ఇంగ్లిష్‌లో పీజీ చేసి ఉండాలి
* అనుభవం – ఫ్రెషర్స్‌ కూడా దరఖాస్తు చేయవచ్చు
* ఇతర నైపుణ్యాలు – ఇంగ్లిష్‌లో నిమిషానికి కనీసం 40 పదాలు లేదా హిందీలో నిమిషానికి కనీసం 30 పదాలు కంప్యూటర్‌లో టైప్‌ చేయగల నైపుణ్యం కలిగి ఉండాలి
* ఉద్యోగం చేయాల్సిన ప్రదేశం – హైదరాబాద్‌
* జీతం స్కేలు – రూ.8,350 నుంచి రూ.1 లక్ష వరకు నెల జీతం ఉంటుంది
* రంగం – కరెన్సీ ముద్రణ
* ఎంపిక చేసే విధానం – రాత పరీక్ష, నైపుణ్యాల పరీక్ష
* దరఖాస్తులు ప్రారంభమైన తేదీ – జూలై 3, 2020
* దరఖాస్తులకు ఆఖరి గడువు – జూలై 31, 2020

వయస్సు, ఫీజు వివరాలు…

జేవోఏ పోస్టులకు అప్లై చేసే వారి వయస్సు 18కి పైగా 28 సంవత్సరాల లోపు ఉండాలి. సూపర్‌వైజర్‌ పోస్టులకు అప్లై చేసే వారి వయస్సు 30 ఏళ్లకు మించరాదు. రిజర్వేషన్లు ఉన్నవారికి వయస్సు పరిమితిలో మినహాయింపు ఇస్తారు. జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులు రూ.600 అప్లికేషన్‌ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్‌టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్‌-ఎస్‌ఎం అభ్యర్థులు రూ.200 చెల్లించాలి. ఆన్‌లైన్‌లో నెట్‌బ్యాంకింగ్‌, డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డుల ద్వారా ఫీజు చెల్లించవచ్చు.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు https://ibpsonline.ibps.in/igmhydjmar20/ లేదా https://igmhyderabad.spmcil.com/Interface/JobOpenings.aspx?menue=5 అనే వెబ్‌సైట్‌లో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version