ఇప్పుడు కాలానికి తగ్గట్టుగా చదువు కూడా మారిపోతోంది. విద్యాసంస్థలు మార్కెట్ అవసరాలకు తగ్గ కోర్సులను ప్రవేశపెడుతున్నాయి. అయితే తాజాగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM Indore) ఇండోర్ కొత్త ఆన్‌లైన్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌ను తీసుకు రావడం జరిగింది. ఎడ్‌టెక్ కెంపెనీ జిగ్‌సా వ్యూహాత్మక భాగస్వామ్యంతో ఈ కోర్సులను తీసుకొచ్చింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..
సేల్స్ ప్రొఫెషనల్స్ కి ఉపయోగపడేలా ఈ ఆన్‌లైన్ కోర్సును డిజైన్ చేసింది. సేల్స్ టీమ్ బిల్డింగ్, డిజిటల్ స్కిల్స్ ని పెంపొందించడంలో ఈ కోర్సు ఉపయోగపడుతుంది. ఇది కేవలం నాలుగు నెలల కోర్సు మాత్రమే. భారత్‌లో సేల్స్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ఈ రంగంలో సేల్స్ ప్రొఫెషనల్ కావాలని కోరుకునే ఎవరైనా సరే ఈ నాలుగు నెలల ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకోవచ్చు అని జిగ్‌సా సీఈవో, కో ఫౌండర్ గౌరవ్ వోహ్రా అన్నారు.
ఈ నాలుగు నెలల ఆన్‌లైన్ ప్రోగ్రామ్ లో నమోదు చేసుకున్న వాళ్లకి అనుభవజ్ఞులతో శిక్షణ ఉంటుంది. సేల్స్ మార్కెట్ డిజిటలైజేషన్‌ను అందిపుచ్చుకోవడం మంచి విషయం అని కూడా చెప్పారు. సేల్స్ నిపుణులుగా ఎదిగేందుకు అవసరమైన అన్ని నైపుణ్యాలను ఈ కోర్సు ద్వారా నేర్పిస్తాం అని చెప్పారు.
అదే విధంగా కోర్సు మిమ్మల్ని అత్యుత్తమ సేల్స్ స్ట్రాటజిస్ట్‌లుగా తీర్చిదిద్దుతుంది అని అన్నారు. నేటి కాంపిటీషన్ మార్కెట్లో అత్యధిక అమ్మకాలను నమోదు చేయడం అనేది నైపుణ్యంతో కూడుకున్నది. దీనికి జ్ఞానం, నైపుణ్యం, క్రమశిక్షణ, నిరంతర అభ్యాసం ఎంతో అవసరం
ఎంట్రన్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్రభుత్వోద్యోగం మీ లక్ష్యమా.. అయితే విజయపథం.కామ్ వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి.