కరెన్సీ నోట్లతో ఇకపై నో టెన్ష‌న్‌.. శుద్ధి చేసే సరికొత్త పరికరం వ‌చ్చేసింది..!!

-

క‌రోనా.. క‌రోనా.. క‌రోనా.. ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఇదే మాట‌. ఎందుకంటే.. వేలాది మంది ఈ మహమ్మారికి వల్ల ప్రాణాలు కోల్పోగా.. బాధితుల సంఖ్య 16 లక్షలు దాటింది. అయితే క‌రోనాను నియంత్రించేందుకు దేశ‌దేశాలు అలుపెరుగ‌ని పోరాటాలు చేస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగా పలు దేశాలు నిషేధాజ్ఞలు విధిస్తున్నాయి. ప్రజలను ఇళ్ల నుంచి రాకుండా ఆంక్షలు జారీచేస్తున్నాయి. అయినా, వైరస్ మరణాలు, బాధితుల సంఖ్య మాత్రం పెరుగుతోంది. ఇదిలా ఉంటే.. క‌రెన్సీ నోట్ల వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు కొత్త టెన్ష‌న్ ప‌ట్టుకుంది.

వైరస్ వ్యాప్తి చేస్తున్నామంటూ కొందరు కరెన్సీ నోట్లకు ఉమ్మిరాస్తూ, తమ ముఖానికి, ముక్కుకు రాసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో కరెన్సీ నోట్లు పట్టుకుంటే కరోనా వస్తుంది అనే భ‌యంతో ఎవరూ డబ్బులు తీసుకోవడం లేదు. అయితే ఇక‌పై క‌రెన్సీ నోట్ల‌తో టెన్ష‌న్ ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే ఐఐటీ రోపార్ ఓ అద్భుత పరికరాన్ని రూపొందింది. దీంట్లో కూరగాయలు, కరెన్సీ నోట్లు, సెల్ ఫోన్లు, ఇతర వస్తువులను ఉంచితే వాటిని ఆ పరికరం కరోనా రహితంగా మార్చేస్తుంది. చూడ్డానికి ఇదో ట్రంకు పెట్టెలా కనిపిస్తుంది. దాంట్లో అల్ట్రా వయొలెట్ జెర్మిసైడల్ ఇర్రేడియేషన్ టెక్నాలజీ వినియోగించారు.

ఇందులో మనం శుభ్రపరచాల్సిన వస్తువులను ఉంచితే అల్ట్రావయొలెట్ కిరణాలు ప్రసారం అవుతాయి. తద్వారా ఆ వస్తువులపై ఉన్న క్రిములు నాశనం అవుతాయి. ఈ పరికరం అందుబాటులోకి వస్తే దీని ఖరీదు రూ.500 కన్నా త‌క్కువే ఉంటుంద‌ట‌. ఇక ఈ ప‌రిక‌రంలో ఒకసారి వస్తువులను ఉంచి శానిటైజేషన్ ప్రక్రియ మొదలుపెట్టిన తర్వాత 30 నిమిషాల సమయం తీసుకుంటుంది. ఆ తర్వాత దీనికి 10 నిమిషాల విశ్రాంతి ఇచ్చి తిరిగి ఉపయోగించుకోవచ్చు. అయితే ప‌ని చేస్తున్న స‌మ‌యంలో ఎవరూ లోపలికి చూడరాదని, దీంట్లో ప్రమాదకర అతినీలలోహిత కిరణాలు ప్రసరిస్తుంటాయి.. అవి క‌ళ్ల‌కు ప్ర‌మాదం క‌లిగిస్తాయ‌ని వెల్ల‌డించారు. ఏదేమైనా క‌రోనా దెబ్బ‌కు ఏవేవో కొత్త కొత్త ప‌రిక‌రాలు పుట్టుకొచ్చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version