దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్న తరుణంలో రైల్వే శాఖ రైలు సర్వీసుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుందని ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. రైలు సర్వీసులను తిరిగి నడిపే ఆలోచానా చేస్తుంది అంటూ వార్తలు వస్తున్నాయి. అందుకు గానూ జాగ్రత్తలు తీసుకుని రైల్ సర్వీసులను పునరుద్దరించే అవకాశం ఉందని అన్నారు. దీనిపై కేంద్ర రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది.
తాజాగా రవాణా శాఖ అధికారి ఒకరు కీలక వ్యాఖ్యలు చేసారు. కేంద్ర ప్రభుత్వం ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నారు. కొన్ని మీడియా సంస్థలు… ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని, అలా చేయడం మంచిది కాదని ఆయన హితవు పలికారు. త్వరలోనే దీనిపై నిర్ణయం ప్రజలకు చెప్పే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
లాక్ డౌన్ పూర్తి అయిన మరుసటి రోజు… అంటే ఏప్రిల్ 15 నుంచి రైలు సర్వీసులను పునరుద్దరించే అవకాశం ఉందని జాతీయ మీడియాలో ఎక్కువగా వార్తలు వస్తున్నాయి. దీనితో జనాలు రైళ్ళు తిరిగే అవకాశం ఉందని చాలా ఆశలు పెట్టుకున్నారు.ఇది నిజం కాదని రైల్వే శాఖ ప్రకటన తో స్పష్టత వచ్చింది. కేబిన్ కి ఒకరిని అనుమతిస్తారు, శానిటేషన్ చేస్తారు, వ్రుద్దులను రానివ్వరు అంటూ ప్రకటనలు వచ్చాయి.