ఐటెం గర్ల్ గా మారిపోనున్న హీరోయిన్‌ ఇలియానా !

-

టాలీవుడ్‌ ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ ఇలియానా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. 2006 లో వచ్చిన దేవ దాసు సినిమాతో టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది ఇలియానా. ఈ సినిమాలో హీరో రామ్‌ పోతినేని సరసన హీరోయిన్‌ గా ఇలియానా నటించి.. మంచి మార్కులు కొట్టేసింది. ఆ సినిమా విజయం సాధించడంతో.. అప్పుడు టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ గా ఎదిగింది.ఇక ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌ వెళ్లి పోయింది. ఇది ఇలా ఉండగా… ఆమె టాలీవుడ్‌ లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారు.

రవితేజ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రవితేజ హీరోగా రామారావు ఆన్‌ డ్యూటీ సినిమా రూపొందుతోంది. శరత్‌ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దివ్యాన్ష కౌశిక, రజీషా విజయన్‌ హీరోయిన్లు గా కనిపించనున్నారు. ఈ సినిమాలో ఒక మాస్‌ మసాలా సాంగ్‌ కూడా ఉంది. అయితే.. ఇందులో ఇలియానా నటించనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు ఇప్పటికే ఇలియానా కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version