ఆన్లైన్ బెట్టింగులో మోసపోయాను క్షమించండి : దాచేపల్లి సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్

-

ఏపీలో పెన్షన్ డబ్బులతో పారిపోయిన దాచేపల్లి సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ లక్ష్మీప్రసాద్ సెల్ఫీ వీడియో తాజాగా వైరల్ అవుతోంది. ‘ఆన్ లైన్ బెట్టింగ్ ఆడి మోసపోయాను. నా కుటుంబం,పిల్లలు రెండు రోజులుగా ఏమీ తినలేదు.కలెక్టర్ గారు దాచేపల్లి కమిషనర్ గారు నన్ను క్షమించండి సార్.

నాకు ఒక్క అవకాశం ఇవ్వండి.నా తల్లిదండ్రులను బతిమిలాడైనా డబ్బులు తీసుకొస్తాను.నెలరోజులలో డబ్బులు చెల్లిస్తాను’ అంటూ సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ సెల్ఫీ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కాగా, ఈ వీడియోపై జిల్లా కలెక్టర్, కమిషనర్ ఏవిధంగా స్పందిస్తారనేది తెలియాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news