దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరేన్స్ ద్వారా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లాక్ డౌన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశమంతా కఠిన లాక్ డౌన్ విధిస్తే.. ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రధాని మోడీ అన్నారు. అలాగే సామాన్యులకు ఉపాధి లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతారని అన్నారు. కరోనా వ్యాప్తి అరికట్టడానికి స్థానికంగానే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రులకు పీఎం మోడీ సూచించారు.
కరోనా వైరస్ చేసే పోరాటంలో సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని తెలిపారు. కాగ ఓమిక్రాన్ వేరియంట్ గతం వచ్చిన వైరస్ వేరియంట్ల కన్నా.. చాలా వేగంగా విస్తరిస్తుందని తెలిపారు. అలాగే ప్రస్తుతం పండగ సీజన్ కావడం తో కరోనా వైరస్, ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ పండగ సీజన్ లో అధికారులు అలర్ట్ గా ఉండాలని సూచించారు.
కాగ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరేన్స్ కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాలేదు. దీంతో రాష్ట్రంలో రాజకీయ చర్చ నడుస్తుంది. వ్యూహాత్మక చర్యలలో భాగంగానే సీఎం కేసీఆర్ వీడియో కాన్పరెన్స్ కు హాజరు కాలేదని తెలుస్తుంది. అయితే దీని పై అధికార పార్టీగానీ, సీఎం కేసీఆర్ గాని ఇంత వరకు స్పందించలేదు.